నేను యూత్ ఏంటీ: కేటీఆర్

First Published Apr 20, 2017, 10:46 AM IST
Highlights

ఈ విషయంలో కాంగ్రెస్ నేతలు మంత్రి కేటీఆర్ ను చూసి చాలా నేర్చుకోవాలి.  

రాజకీయాల్లో యువత అంటే కనీసం 50 ఏళ్లు దాటాలి. నమ్మకం లేకపోతే దేశంలోని ఏ పార్టీ యూత్ లీడర్లనైనా తీసుకోండి. వారి వయసు తెలుసుకోండి. వాస్తవం ఏంటో తెలుస్తుంది. మరీ, ముఖ్యంగా కాంగ్రెస్ లో యూత్ లీడర్ కావాలంటే 40 ఏళ్లకు పైనే ఉండాలి. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పడమంటే... సినిమా హీరోలే కాదు రాజకీయ నాయకులు కూడా వయసు బటయపెట్టడానికి అస్సలు ఇష్టపడరు.

 

వయసు అయిపోతుందని ఎక్కడ పదవి పీకేస్తారేమోనని వారి భయం. అందుకే నెరిసిన జుట్టుకు రంగు వేసుకుంటూ తెగ మానేజ్ చేస్తుంటారు. ఈ విషయంలో టీఆర్ఎస్ నేత, ఐటీ మంత్రి కేటీఆర్ ను మాత్రం మినహాయించాల్సిందే. ఎందుకంటే నేనీమీ కుర్రాన్ని కాదు అని ఆయనే ఒప్పుకున్నారు.

 

నిన్న కేటీఆర్.. ఎంఐఎం నేతలతో కలసి పాతబస్తీలో పర్యటించిన విషయం తెలిసిందే. అక్కడ క్యారమ్ ఆడారు. కాసేపు క్రికెట్ బ్యాట్ పట్టి అక్కడి యూత్ తో కలిసిపోయారు. ఇదంతా తర్వాత తన ట్విటర్ లో పోస్టు చేశారు.

 

ఆ పోస్టు చూసిన ఓ అభిమాని .. 'ఈ మధ్యకాలంలో నెరసిన జుట్టుతో కనిపిస్తున్నారు. మీరు యూత్ లీడర్, మంత్రుల్లో మీదే చిన్న వయసు. జుట్టుకు హెయిర్ డై వేసుకోండి.. 'అని సూచించాడు. దీనికి కేటీఆర్ రిప్లై ఇస్తూ.. తానేమీ మరీ అంత కుర్రాన్ని కాదని అనుకుంటున్నా అని తేల్చేశాడు.

click me!