బస్సుయాత్ర, బహిరంగ సభలు: నేడు హైద్రాబాద్ లో కాంగ్రెస్ పీఏసీ భేటీ

By narsimha lode  |  First Published Jul 23, 2023, 10:13 AM IST

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం ఇవాళ  జరగనుంది.  బస్సు యాత్ర, ప్రియాంక  గాంధీ  సభ ఏర్పాట్లపై  చర్చించనున్నారు.



హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం  ఆదివారంనాడు గాంధీ భవన్ లో జరగనుంది.  బస్సు యాత్ర, జిల్లాల వారీగా బహిరంగ సభలు,  ప్రియాంక గాంధీ  సభ ఏర్పాట్ల విషయమై  చర్చించనున్నారు.

ఈ నెల  19వ తేదీన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాసంలో  కాంగ్రెస్ ముఖ్యులు సమావేశమయ్యారు.ఈ సమావేశంలో  బస్సు యాత్ర, బహిరంగ సభల నిర్వహణ,  కొల్లాపూర్ లో ప్రియాంక గాంధీ సభ నిర్వహణపై  చర్చించారు. అయితే  ఈ  విషయాలపై  పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు.  దీంతో ఆదివారంనాడు  కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం  ఇవాళ జరగనుంది.  గాంధీ భవన్ లో ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు  పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు.

Latest Videos

also read:స్ట్రాటజీ రోడ్ మ్యాప్‌తో ఎన్నికలకు వెళ్తాం: కేసీఆర్ పై కోమటిరెడ్డి ఫైర్

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో  కాంగ్రెస్ నేతలు నిర్వహించిన  బస్సు యాత్ర మంచి ఫలితాలను  ఇచ్చిందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గుర్తు  చేస్తున్నారు. ఇదే తరహాలో బస్సు యాత్ర చేయాలని ఆయన  కోరుతున్నారు. బస్సు యాత్ర విషయమై పార్టీ నేతలు సూచనప్రాయంగా అంగీకరించారు.  అయితే బస్సు యాత్రను ఎక్కడి నుండి ఎప్పటివరకు  ఎలా నిర్వహించాలనే దానిపై ఇవాళ  జరిగే  పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో చర్చించనున్నారు.

మరో వైపు  రాష్ట్రంలోని  పలు ప్రాంతాల్లో  బహిరంగ సభలు నిర్వహించాలని  కాంగ్రెస్ పార్టీ  బావిస్తుంది.ఈ సభల నిర్వహణపై కూడ నిర్ణయం తీసుకోనున్నారు.  ఈ నెల  30న  కొల్లాపూర్ లో ప్రియాంక  గాంధీ  సభ నిర్వహించనున్నారు.ఈ సభలో  మాజీ మంత్రి  జూపల్లి కృష్ణారావు  కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ సభ నిర్వహణపై  ఈ సమావేశంలో  చర్చించనున్నారు.కాంగ్రెస్ పార్టీ పీఏసీ సమావేశంలో పాల్గొనేందుకు  ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రే  హైద్రాబాద్ కు  రానున్నారు. 

ఇతర పార్టీల నుండి చేరికల విషయమై కూడ ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.  ఇటీవలనే  గద్వాల జిల్లా పరిషత్ చైర్ పర్సన్  సరిత  కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే  ఇతర పార్టీల నుండి పార్టీలో  చేరికల విషయమై స్థానికంగా ఉన్న ఇబ్బందులపై  కూడ  ఈ సమావేశంలో చర్చించనున్నారు.


 

click me!