హైద్రాబాద్ నగరంలోని బహదూర్‌పురలో ఓ పునుగు పిల్లిని స్థానికులు గుర్తించారు. ఈ పునుగు పిల్లిని పట్టుకొని జూపార్క్ కు తరలించారు.
హైదరాబాద్: నగరంలోని బహదూర్ పుర కిషన బాగ్ లో పునుగు పిల్లిని స్థానికులు గుర్తించారు. ఓ ఇంటి పైప్‌లైన్ ను పట్టుకుని ఎగబాకుతున్న సమయంలో గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, స్థానికుల సహకారంతో పునుగు పిల్లిని చాకచక్యంగా పట్టుకున్నారు. పునుగు పిల్లిని జూపార్క్ కు తరలించారు.
పునుగు పిల్లి తైలాన్ని తిరుమల వెంకటేశ్వరస్వామి వారికి వినియోగిస్తారు. పునుగు పిల్లి తైలంగా శ్రీవారికి అత్యంత ఇష్టంగా చెబుతారు. అందుకే ఈ తైలాన్ని స్వామివారి విగ్రహనికి పులుముతారు. ప్రతి శుక్రవారం నాడు స్వామివారికి అభిషేకం నిర్వహించిన తర్వాత పునుగు పిల్లి తైలాన్ని స్వామి వారి విగ్రహనికి పూస్తారు.
హైద్రాబాద్ బహదూర్ పురలోని ఓ ఇంటి వద్ద రాత్రి పూట పునుగు పిల్లిని పట్టుకుని జూపార్క్ కు తరలించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి వెంకన్న కోసం టీటీడీ పునుగు పిల్లులను పెంచుతున్నారు.
2021 సెప్టెంబర్ మాసంలో కృష్ణా జిల్లాలో పునుగు పిల్లి కన్పించింది.ఈ పునుగు పిల్లిని అటవీశాఖాధికారులకు అప్పగించారు స్థానికులు. 1972 వన్యప్రాణి చట్టం ప్రకారంగా పునుగు పిల్లిని పెంచుకోవడం చట్టరీత్యా నేరం. పునుగు పిల్లి తైలం మంచి సుగంధాన్ని వెదజల్లుతుంది.