భారీ వర్షాల ఎఫెక్ట్... ఆదిలాబాద్ లో 20కి.మీల భారీ ట్రాఫిక్ జామ్

Published : Jul 23, 2023, 09:35 AM ISTUpdated : Jul 23, 2023, 09:44 AM IST
 భారీ వర్షాల ఎఫెక్ట్... ఆదిలాబాద్ లో 20కి.మీల భారీ ట్రాఫిక్ జామ్

సారాంశం

భారీ వర్షాలతో పెన్ గంగ నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ఆదిలాబాద్ జిల్లాలో భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. 

ఆదిలాబాద్ : తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోతోంది. వరద నీరు పోటెత్తడంతో నదులు, వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండగా జలాశయాలు, చెరువులు నిండుకుండల్లా మారాయి. ఇలా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రాణహిత, పెన్ గంగ నదులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. దీంతో 44వ నంబర్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయి ఏకంగా 20 కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి అతిపెద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 

ఇటీవల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉపనది పెన్ గంగ మహోగ్రరూపం దాల్చింది. దీంతో జైనథ్ మండలం డొలారా వద్ద 50 మీటర్ల ఎత్తులో వున్న వంతెనను పెన్ గంగ నీరు తాకింది. దీంతో 44 జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయి భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. దాదాపు 20 కి.మీ మేర ట్రాఫిక్ నిలిచిపోయి తెలంగాణ-మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పెన్ గంగ వరద ప్రవాహం తగ్గేవరకు బ్రిడ్జి పైనుంచి వాహనాల రాకపోకలను అనుమతించబోమని ఆదిలాబాద్ పోలీసులు చెబుతున్నారు. 

భారీ వర్షాలతో ఎగువన గల ప్రాజెక్ట్ గేట్లను తెరిచారని... అందువల్లే పెన్ గంగ నది ప్రవాహం ప్రమాదకరంగా వుందని అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్ట్ గేట్లను మూసేస్తేనే నదీప్రవాహం తగ్గనుందని... అప్పుడే డొలారా వద్దగల బ్రిడ్జిపైనుండి రాకపోకలకు వీలు కలుగుతుందని తెలిపారు. అప్పటివరకు 44వ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ తప్పదని ఆదిలాబాద్ అధికారులు హెచ్చరిస్తున్నారు. 

Read More  హైదరాబాద్ లో భారీ వ‌ర్షం.. హిమాయత్ సాగర్ మరో రెండు గేట్లు తెరిచే అవకాశం

ఇదిలావుంటే ఇప్పటికే తెలంగాణవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదీ పరివాహక, లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరి కట్టుబట్టలతో సురక్షిత ప్రాంతాలకు తరలి వెళుతున్నారు. వర్షాలు కొద్దిగా తగ్గుముఖం పట్టినా భారీ వర్షాలు కురిసే అవకాశం వుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు భయపెడుతున్నాయి. 

  ప‌శ్చిమ మధ్య బంగాళాఖాతం వెంబడి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరంలో ఏర్పడిన అల్పపీడనం, సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించిన ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉత్తర చత్తీస్ గఢ్ ప్రాంతం, తూర్పు-పశ్చిమ విండ్ షీర్ జోన్ లో 20 డిగ్రీల ఉత్తర అక్షాంశంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. వీటి ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందనీ, పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఉత్తరాది జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల 7 సెంటీమీటర్ల నుంచి 12 సెంటీమీటర్లు, 12 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు.

ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కొమురం భీం, మంచిర్యాల జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల 12 సెంటీమీటర్ల నుంచి 20 సెంటీమీటర్లు లేదా 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, దాని అనుబంధ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
 

 
 

PREV
click me!

Recommended Stories

Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్