
తెలంగాణా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఎంతో కాయుష్‌తో కట్టుకున్న పెద్ద క్యాంపు ఆఫీస్‌ను, వ్యవసాయ ఫాం హౌజ్‌ను వెంటనే పర్యాటక కేంద్రాలుగా గుర్తించాలని టీపీసీసీ ఉపాధ్యక్షులు పొన్నం ప్రభాకర్ కోరుతున్నారు.
తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇవి రెండు కళ్లయ్యాయని కరీంనగర్ మాజీ ఎంపి కూడా అయిన పొన్నం అభిప్రాయపడుతున్నారు.
ముఖ్కమంత్రి దగ్గిరుండి, జాగ్రత్తగా, వాస్తు పొల్లుపోకుండా, ఆంద్రోళ్ల నీడపడకుండా, భారీ నిధులు వెచ్చించి రూపొందించుకున్నారు, వీటికున్నంత సెక్యూరిటీ ప్రాముఖ్యం తెలంగాటణాలో మరే ప్రదేశాలకు లేదు. అందువల్ల టిఆర్ ఎస్ ప్రభుత్వం గర్వ పడే అఛీవ్ మెంట్స్ ఇవి కాకుండా మరొకటి కనిపించడం లేదు కాబట్టి వీటిని రాష్ట్రం కోసం పోరాడిన వారంతా చూసి గర్వపడాలని ఆయన అంటున్నారు.
ఈ మేరకు పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మెన్ పేర్వారం రాములుకు ఆయన ఒక లేఖ రాశారు.
‘తెలంగాణలో చూడదగ్గ పర్యాటక ప్రాంతాలను టూరిజం చైర్మెన్‌గా బాగా అభివృద్ధి చేస్తున్నట్టు పేపర్లో చదివాను. నిజమెంతో తెల్వదు. కానీ సీఎం మెచ్చి ఆ పదవి మీకు ఇచ్చారు. ఆ పదవికి న్యాయం చేయాలని కోరారు. రాజైతే ఉన్న భవంతులు వాస్తు ప్రకారం బాగలేకపోతే కూలగొట్టి మల్ల తనకు నచ్చినట్టు కట్టుకుంటడు. అందుకే తమ రాజు కేసీఆర్ తొమ్మిదెకరాల్లో 500 కోట్లతోటి ఆధునిక హంగులు, సౌకర్యాలతో కట్టుకున్న రాజభవంతి ఎట్లున్నదో చూసి ముర్వాలనుకుంటున్నరు. రైతులంతా అప్పుల పాలవుతుంటే రాజు కేసీఆర్‌కు కోట్లు ఎట్ల పండుతున్నయని జనం డౌటు తింటుండ్రు. అందుకే రాజుగారి ఫామ్ హౌస్‌ను ఓ సారి సూడాలనేది జనం కాయిషు,’ అని ఆయన లేఖలో పేర్కొన్నారు.
టూరిజం చైర్మెన్‌గా ప్రజల కోరికలు మీరే తీర్చాలే అని అంటూ , ‘రాజు గారి ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రాన్ని టూరిజం ప్లేస్‌గా గుర్తించి రైతులను తోల్కపోయి సూపెట్టి స్కీమ్ ఒకటి పెట్టాలే. రాజు చేస్తున్న వ్యవసాయాన్ని చూసి రైతులు నేర్చుకుని వాళ్లు కూడా గట్లనే పంటలు పండిస్తరు. దాంతోటి వాళ్లకున్న అప్పులన్నీ తీరుతాయి. అప్పుడు రాజు గారి పేరు మరింత పెద్దగా పపంచెమంతా తెలుస్తది. అందుకే కోరుకున్నట్టుగా రాజుగా భవంతి, ఫామ్ హౌస్ టూరిజం ప్లేసులుగా ప్రకటించేసి వాటిని జనం చూసి తరించేలా చర్యలు తీసుకుంటే...మీకు చైర్మెన్ పదవి ఇచ్చిన రాజు కేసీఆర్ రుణం తీర్చుకునోల్లు అయితరు,’ అని పొన్నం ఈ లేఖలో పేర్కొన్నారు.