ఆ ఉగ్రవాదులు హీరోల్లా ఫీలయ్యారు

First Published Dec 24, 2016, 2:45 PM IST
Highlights

దిల్ సుఖ్ నగర్ పేలుళ్ల ఉగ్రవాదులపై ఎన్ ఐ ఏ

 

దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల సూత్రధారులు తమకుతాము హీరోల్లా ఫీలయ్యారని ఎన్‌ఐఏ కోర్టు అభిప్రాయపడింది.

 

జిహాద్‌ పేరుతో అమాయకుల ప్రాణాలను తీశారని, వారి సిద్ధాంతం చాలా ప్రమాదకరంగా ఉందని పేర్కొంది.

 

చట్టాల నుంచి తప్పించుకోవడంలో దోషులు సుశిక్షితులుగా ప్రవర్తించారని చెప్పింది.

 

ఇంకా పేలుడు పదార్థాలు దొరికి ఉంటే మరో బాంబుకూడా పేల్చేయాలని తెలిసిందని వెల్లడించింది.

 

కోఠీ, అబిడ్స్‌, బేగంబజార్‌, సీబీఐ కార్యాలయం వద్ద సైతం వారు రెక్కీ నిర్వహించారని పేర్కొంది.

 

పేలుళ్ల క్షతగాత్రులకు ప్రభుత్వం సరైన పరిహారం ఇవ్వలేదని అభిప్రాయపడింది.
 

 ఏ వన్‌ మిర్చీ సెంటర్‌ నిర్వాహకుడికి రూ. లక్ష, 107 బస్టాప్‌ దెబ్బతిన్నందున ఆర్టీసీకి రూ. 50 వేలు ఇవ్వాలని న్యాయసేవసాధికారక సంస్థను ఆదేశించింది.

 

అన్ని అంశాలు పరిశీలించాకే ఉగ్రవాదులకు ఉరిశిక్ష విధించినట్లు 697 పేజీల తీర్పులో ఎన్ ఐ ఏ ప్రత్యేక న్యాయస్థానం పేర్కొంది.

 

click me!