CM KCR: 23న వ‌న‌ప‌ర్తికి కేసీఆర్‌.. సీఎం జిల్లా పర్యటన షెడ్యూల్‌లో మార్పులు

By Mahesh Rajamoni  |  First Published Dec 18, 2021, 9:57 AM IST

CM KCR :  ధాన్యం కొనుగోలు విష‌యంలో ప్ర‌భుత్వాలు తీసుకుంటున్న చ‌ర్యల కార‌ణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్ర ప్ర‌భుత్వం తీసుకుంటున్న నిర్ణ‌యాలకు వ్య‌తిరేకంగా తెలంగాణ స‌ర్కారు పోరుకు సిద్ధ‌మ‌వుతోంది. ఈ నెల 20న రాష్ట్ర వ్యాప్త నిర‌స‌న‌ల‌కు పిలిపునిచ్చిన సీఎం కేసీఆర్‌... జిల్లా ప‌ర్య‌ట‌న షెడ్యూల్ లో మార్పులు చోటుచేసుకున్నాయి. 
 


CM KCR :  ధాన్యం కొనుగోలుకు సంబంధించి రాష్ట్ర ప్ర‌భుత్వం.. కేంద్రంలోని మోడీ స‌ర్కారుకు వ్య‌తిరేకంగా పోరుకు సిద్ధ‌మ‌వుతోంది. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందేన‌నీ, దీనిపై  స్ప‌ష్ట‌మైన హామీ ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తోంది. ఈ నేప‌థ్యంలో ధాన్యం కొనుగోలులో కేంద్రం వైఖరిపై ఈ నెల 20న రాష్ట్ర వ్యాప్త నిరసనకు ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు నేతృత్వంలోని తెలంగాణ స‌ర్కారు పిలుపునిచ్చింది. ఈ క్ర‌మంలోని రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నిర‌స‌న‌లు చేయ‌డానికి ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసింది. దీనిలో భాగంగా  సీఎం కేసీఆర్‌ ఈ నెల 20 నుంచి జిల్లా ప‌ర్య‌ట‌న‌ల‌కు వెళ్ల‌నున్నారు. అయితే, కేసీఆర్ జిల్లా పర్యటన షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు  చోటుచేసుకున్నాయి. ఈనెల 19 నుంచి ప్రారంభం కావాల్సిన సీఎం జిల్లాల పర్యటన, ఈ నెల 23 నుంచి ప్రారంభ‌మవుతోంది. ఈ నెల 23న వనపర్తి జిల్లా పర్యటనలో భాగంగా కొత్త కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయ‌నున్నారు.

Also Read: Amit Shah | కొన్ని తప్పుడు నిర్ణయాలను తీసుకున్నాం.. కానీ.. : అమిత్ షా

Latest Videos

undefined

వ‌న‌ప‌ర్తి ప‌ర్య‌ట‌న‌లో భాగంగా  కొత్త మార్కెట్‌ యార్డు, రెండు పడకల గదుల ఇళ్ల ప్రారంభంతో పాటు వైద్యకళాశాల, నర్సింగ్‌ కళాశాల, కర్నెతండా ఎత్తిపోతల పథకం, వేరుశనగ పరిశోధనా కేంద్రం, గొర్రెల పునరుత్పత్తి కేంద్రం, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం, నీటి పారుదల శాఖ సీఈ కార్యాలయాలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన  చేయ‌నున్నారు.  అలాగే, వ‌న‌ప‌ర్తిలో టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించ‌నున్నారు. ఈ క్ర‌మంలో అక్క‌డ బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హిస్తున్నారు. ఈ బ‌హిరంగ స‌భ‌లో సీఎం కేసీఆర్ ప్ర‌సంగించ‌నున్నారు. ఇక జిల్లాల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా కేంద్రంపై పోరుకు సిద్దంగా.. ధాన్యం పండిస్తున్న అన్న‌దాత‌లు ప‌డుతున్న క‌ష్టాల‌ను హైలెట్ చేయ‌నున్నార‌ని తెలిసింది. అలాగే, రాష్ట్రంలో దూకుడుగా ముందుకు సాగుతున్న బీజేపీతో పాటు ప్ర‌తిప‌క్షాల‌ను లక్ష్యంగా చేసుకుని కేసీఆర్ ప‌ర్య‌ట‌న కొన‌సాగించ‌నున్నార‌ని స‌మాచారం. ప్ర‌భుత్వంపై ప్ర‌తిప‌క్షాలు కురిపిస్తున్న విమ‌ర్శ‌ల‌ను తిప్పికొడుతూ.. ప్ర‌భుత్వంపై త‌ప్పుడు ప్ర‌చారాల‌ను అడ్డుక‌ట్ట‌వేసే విధంగా ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌డానికి కేసీఆర్ ప‌క్కా ప్ర‌ణాళిక‌ల‌తో ముందుకెళ్ల‌డానికి సిద్ధ‌మ‌య్యార‌ని తెలిసింది.

Also Read: AP: మా ఇళ్లల్లో మేం బతుకుతుంటే ఎందయ్య మీ లొల్లి.. పోలీసులపై చింతమనేని ఫైర్

ఇదిలావుండ‌గా, అసెంబ్లీ మాజీ స్పీక‌ర్ సిరికొండ మ‌ధుసుద‌నాచారి గ‌వ‌ర్న‌ర్ కోటాలో శాసన మండలికి ఎన్నికైన  సంగ‌తి తెలిసిందే. సిరికొండ మధుసద‌నాచారితో పాటు స్థానిక సంస్థల కోటాలో ఎన్నికైన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీను సీఎం కేసీఆర్ అభినందించారు. కొత్త‌గా ఎన్నికైన  ఎమ్మెల్సీలు భానుప్రసాద్, ఎల్‌.రమణ, తాతా మధు, డాక్టర్‌ యాదవరెడ్డి, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి తదితరులు కేసీఆర్‌ను కలిశారు.  ఇటీవ‌లే జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ కోటా ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ అన్ని స్థానాలు గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే, కొన్ని స్థానాల్లో క్రాస్ ఓటింగ్ జ‌ర‌గ‌డంపై టీఆర్ఎస్ నేత‌ల్లో క‌ల‌వ‌రం మొద‌లైంద‌ని తెలుస్తోంది. దీనిపై పార్టీలో చర్చిస్తామ‌ని నాయ‌కులు వెల్ల‌డించారు. క్రాస్ ఓటింగ్ తో కాంగ్రెస్ ఓట్లు ప‌డిన సంగ‌తి తెలిసిందే. 

Also Read: Nara Lokesh | జగన్ పాలన నియంత పాలనకు నిదర్శనం: నారా లోకేష్

click me!