వివాహేతర సంబంధం : బెదిరించి మహిళపై యువకుడు అత్యాచారం.. వీడియో తీసిన 17యేళ్ల బాలుడు..

Published : Dec 18, 2021, 09:48 AM IST
వివాహేతర సంబంధం : బెదిరించి మహిళపై యువకుడు అత్యాచారం.. వీడియో తీసిన 17యేళ్ల బాలుడు..

సారాంశం

ఈ నెల 13న రాత్రి మహిళ ఇంటికి ఆమె ప్రియుడు వచ్చాడు. కాసేపటి తరువాత తిరిగి వెళ్తుండగా అదే ప్రాంతంలో ఉంటున్న ఇస్మాయిల్ (23), మరో బాలుడు (17) ప్రియుడిని అటకాయించారు. ప్రియుని వద్ద ఫోన్ లాక్కునే బెదిరించారు. ఈ అలికిడితో మహిళ బయటకు వచ్చింది. మీ వివాహేతరబంధం బయటపెడతానని ఆమెను బెదిరించి ఇస్మాయిల్.. ఆమెను బలవంతంగా గదిలోకి తీసుకుపోయి అత్యాచారానికి పాల్పడ్డాడు. 

హైదరాబాద్ : ఓ మహిళను బెదిరించిన ప్రబుద్ధుడు.. ప్రియుడి ముందే ఆమెపై rape attemptకి పాల్పడ్డాడు. అవమాన భారం భరించలేక బాధితురాలు, ఆమె ప్రియుడు వికారాబాద్ సమీపంలో విషం తాగి suicideకు యత్నించారు. ఎస్ ఆర్ నగర్ ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం... వనపర్తి జిల్లాకు చెందిన మహిళ (32)కు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్తతో కలిసి కూలీ పనులు చేసుకునే మహిళ... బోరబండ ప్రాంతంలో నివాసం ఉంటుంది. ఈమెకు ఇదే ప్రాంతానికి చెందిన మరో వ్యక్తి (22) తో పరిచయం ఏర్పడింది. ఇది కాస్త Extramarital affairకి దారితీసింది.

దీంతో తరచూ వీరిద్దరూ కలుసుకునే వారు. ఈ క్రమంలో ఈ నెల 13న రాత్రి మహిళ ఇంటికి ఆమె ప్రియుడు వచ్చాడు. కాసేపటి తరువాత తిరిగి వెళ్తుండగా అదే ప్రాంతంలో ఉంటున్న ఇస్మాయిల్ (23), మరో బాలుడు (17) ప్రియుడిని అటకాయించారు. ప్రియుని వద్ద ఫోన్ లాక్కునే బెదిరించారు. ఈ అలికిడితో మహిళ బయటకు వచ్చింది. మీ వివాహేతరబంధం బయటపెడతానని ఆమెను బెదిరించి ఇస్మాయిల్.. ఆమెను బలవంతంగా గదిలోకి తీసుకుపోయి అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఇంకో దారుణం ఏంటంటే.. ఈ అత్యాచార దృశ్యాలను నిందితుడితో ఉన్న మరో బాలుడు వీడియోలో చిత్రీకరించారు.

తమ పని పూర్తయిన తరువాత నిందితులు వెళ్ళిపోతూ.. ప్రియుడికి ఫోన్ ఇచ్చేశారు. అయితే తమకు జరిగిన ఈ అవమానంతో ఆ మహిళ, ప్రియుడు ఆత్మహత్య చేసుకుందామని భావించారు. మహిళ ఈ నెల 14న ద్విచక్రవాహనంపై వికారాబాద్ సమీపంలోని కండ్లపల్లి గేటు వద్ద నీలగిరి చెట్ల తోటలోకి వెళ్లారు. అప్పటికే దారిలో కొనుగోలు చేసిన  విషం తాగారు. అంతకుముందు ప్రియుడు తాము ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషయాన్ని అతని సోదరుడికి ఫోన్లో చెప్పాడు.

Hyderabd road accident : డివైడర్ ఢీకొన్న కారు, డ్రైవర్ సహా ఇద్దరు లేడీ జూనియర్ ఆర్టిస్టుల మృతి

విషం తాగిన ఇద్దరు అపస్మారక స్థితిలోకి వెళ్లగా... సమాచారం అందుకున్న బాధితుడు సోదరుడు వెంటనే అక్కడకు వచ్చి వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం కోలుకున్న బాధితురాలు.. జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు  ఇస్మాయిల్,  బాలుడి కోసం కోసం గాలిస్తున్నారు.  ప్రియుడి పరిస్థితి విషమంగా ఉండడంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

ఇదిలా ఉంగడా జబల్పూర్ లో  ఏడో తరగతి చదువుతున్న 14ఏళ్ల బాలికపై gang rapeకి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. Madhya Pradesh లోని జబల్ పూర్ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో బాలిక తండ్రి స్నేహితులే నిందితులను పోలీసులు తెలిపారు. 

ఈ మేరకు 25, 26 ఏళ్ళ వయసున్న నిందితులు బాధితురాలిని ఆమె ఇంటి పెరట్లోనే దారుణానికి పాల్పడ్డారని అదనపు ఎస్పీ సంజయ్ అగర్వాల్ తెలిపారు. డిసెంబర్ ఏడో తేదీన జరిగిన ఈ ఘటనకు సంబంధించి నిందితులు ఇద్దరిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్