ఈటలకి మరో షాక్: కొడుకు నితిన్ రెడ్డిపై భూకబ్జా ఆరోపణలపై విచారణకు కేసీఆర్ ఆదేశం

By narsimha lodeFirst Published May 23, 2021, 10:51 AM IST
Highlights

మాజీ మంత్రి ఈటల రాజేందర్ తనయుడు నితిన్ రెడ్డి భూ కబ్జాలపై  సమగ్ర దర్యాప్తు చేయాలని  సీఎం కేసీఆర్ ఆదివారం నాడు ఆదేశించారు. 

హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ తనయుడు నితిన్ రెడ్డి భూ కబ్జాలపై  సమగ్ర దర్యాప్తు చేయాలని  సీఎం కేసీఆర్ ఆదివారం నాడు ఆదేశించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని రావల్‌కోల్‌కు చెందిన మహేష్ ముదిరాజ్ తన భూమిని ఆక్రమించుకొన్నారని సీఎంకు ఫిర్యాదు చేశాడు.   మాజీ మంత్రి ఈటల రాజేందర్ తనయుడు నితిన్ రెడ్డి తన భూమిని ఆక్రమించుకొన్నారని  మహేష్ ముదిరాజ్ వీడియోను సోషల్ మీడియాలో ఓ వీడియోను  పోస్టు చేశాడు. తనకు న్యాయం చేయాలని కూడ ఆ వీడియోలో కోరాడు. 

ఈ విషయమై బాధితుడు సీఎంకి కూడ ఫిర్యాదు చేశారు. ఈ పిర్యాదు ఆధారంగా సీఎం కేసీఆర్ సమగ్ర దర్యాప్తు చేయాలని  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. ఏసీబీ, విజిలెన్స్, రెవిన్యూ శాఖలతో విచారణ చేయాలని  సీఎం కేసీఆర్ కోరారు. సమగ్ర దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశంచారు. 

also read:ఈటలకు షాక్, ముఖ్య అనుచరుడిపై కేసు.. కేసీఆర్, గంగులపై వ్యాఖ్యలే కారణం

ఇప్పటికే మాసాయిపేట, హాకీంపేట గ్రామాల్లో అసైన్డ్ భూములను మంత్రి భార్య జమున నడుపుతున్న హేచరీస్ సంస్థ ఆక్రమించుకొంది. ఈ విషయమై విచారణ సాగుతోంది. మరోవైపు దేవర యంజాల్ భూమిలో దేవాలయ భూములను కూడ మంత్రి ఈటల రాజేందర్ ఆయన అనుచరులు ఆక్రమించుకొన్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై ఐఎఎస్‌ల కమిటీ విచారణ చేస్తోంది. 


 

click me!