లాక్‌డౌన్: తెలంగాణలో ఈ-కామర్స్, పుడ్‌డెలివరీ యథాతథం

Published : May 23, 2021, 10:35 AM IST
లాక్‌డౌన్: తెలంగాణలో ఈ-కామర్స్, పుడ్‌డెలివరీ యథాతథం

సారాంశం

 తెలంగాణ రాష్ట్రంలో ఈ కామర్స్ సేవలకు యధాతథంగా కొనసాగుతాయని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఈ కామర్స్ సేవలకు యధాతథంగా కొనసాగుతాయని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.రాష్ట్రంలో లాక్‌డౌన్ ను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. ఈ తరుణంలో  పుడ్ డెలివరీతో పాటు ఈ కామర్స్ సేవలు యధాతథంగా కొనసాగతాయని డీజీపీ మహేందర్ రెడ్డి ప్రకటించారు. శనివారం నాడు పలు ఈ కామర్స్ సిబ్బంది వాహనాలను సీజ్ చేశారు. అంతేకాదు  ఉదయం 10 గంటల తర్వాత  ఈ కామర్స్ సేవలకు ఆటంకం కల్గించారు. 

alsoread :ఈ పాస్ ఉంటేనే తెలంగాణలోకి వాహనాల అనుమతి: తెలంగాణ- ఏపీ సరిహద్దుల్లో ఆంక్షలు

ఈ విషయమై ఈ కామర్స్ ప్రతినిధులు  మంత్రి కేటీఆర్ కు ట్విట్టర్ ద్వారా తెలిపారు. దీంతో ఈ విషయాన్ని పరిశీలించాలని డీజీపీ మహేందర్ రెడ్డిని కేటీఆర్ ఆదేశించారు. తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి హైద్రాబాద్, రాచకొండ, సైబరాబాద్ సీపీలతో ఈ విషయమై మాట్లాడారు. ఈ కామర్స్ సంస్థల ప్రతినిధులతో పాటు పుడ్ డెలివరీ కి ఎలాంటి ఇబ్బందులు లేవని డీజీపీ మహేందర్ రెడ్డి ఆదివారం నాడు స్పష్టం చేశారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు