సంతోష్ కుటుంబానికి సీఎం కేసీఆర్ పరామర్శ: ఉద్యోగం, ఇంటి స్థలం, రూ. 5 కోట్ల చెక్ అందజేత

By narsimha lodeFirst Published Jun 22, 2020, 3:54 PM IST
Highlights

చైనా ఆర్మీ దాడిలో మరణించిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబసభ్యులకు తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారంనాడు పరామర్శించారు. 
 

సూర్యాపేట: చైనా ఆర్మీ దాడిలో మరణించిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబసభ్యులకు తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారంనాడు పరామర్శించారు. 

ఫామ్‌హౌస్ నుండి నేరుగా సీఎం కేసీఆర్  రోడ్డు మార్గంలో సూర్యాపేట విద్యానగర్ లోని సంతోస్ బాబు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు.ఇంట్లోకి వెళ్లే ముందు సూర్యాపేట పట్టణంలోని సంతోష్ కుమార్ చిత్రపటానికి కేసీఆర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

అంతేకాదు సంతోష్ బాబు భార్యకు  డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగానికి సంబంధించిన నియామక పత్రాన్ని అందించారు.  మరో వైపు సంతోష్ బాబు కుటుంబానికి జూబ్లీహిల్స్‌ స్టడీ సర్కిల్ వద్ద 711 గజాల స్థలానికి సంబంధించిన పత్రంతో పాటు  రూ. 5 కోట్ల చెక్కును పోలీసులు అందించారు. 

also read:చైనా-ఇండియా మధ్య ఉద్రిక్తత: కమాండర్ స్థాయి అధికారుల మధ్య చర్చలు

రూ. 5 కోట్లలో  రూ. 4 కోట్లు సంతోష్ బాబు భార్యకు, కోటి రూపాయాలను సంతోష్ బాబు తల్లిదండ్రులకు సీఎం అందించారు. ఈ నెల 15వ తేదీన చైనా, ఇండియాతో జరిగిన ఘర్షణలో సంతోష్ బాబు మరణించాడు.ఈ నెల 15వ తేదీన చైనా, ఇండియాతో జరిగిన ఘర్షణలో సంతోష్ బాబు మరణించాడు. సంతోష్ బాబుతో పాటు మరో 20 మంది ఇండియాకు చెందిన సైనికులు  మరణించారు.

click me!