కరోనాతో కాలాపత్తర్ ఎఎస్ఐ యూసుఫ్ మృతి

Published : Jun 22, 2020, 02:59 PM IST
కరోనాతో కాలాపత్తర్ ఎఎస్ఐ యూసుఫ్ మృతి

సారాంశం

కరోనాతో కాలాపత్తర్‌లో ఎఎస్ఐగా పనిచేస్తున్న ఎఎస్ఐ యూసుఫ్ మరణించాడు. వారం రోజుల క్రితమే ఆయన కరోనా చికిత్స కోసం ఆసుపత్రిలో చేరాడు

హైదరాబాద్: కరోనాతో కాలాపత్తర్‌లో ఎఎస్ఐగా పనిచేస్తున్న ఎఎస్ఐ యూసుఫ్ మరణించాడు. వారం రోజుల క్రితమే ఆయన కరోనా చికిత్స కోసం ఆసుపత్రిలో చేరాడు.

 పోలీసు శాఖలో కరోనాతో మరణించినవారి సంఖ్య మూడుకు చేరుకొంది. తొలుత యాదగిరి రెడ్డి అనే కానిస్టేబుల్ మరణించాడు. ఈ నెల 16వ తేదీన హోంగార్డు కరోనాతో మరణించాడు. ఆయన డబీర్ పురా పోలీస్ స్టేషన్ లో పనిచేసేవాడు.

also read:హైద్రాబాద్‌లో కరోనాతో హొంగార్డు ఆశోక్ మృతి

మే 21వ తేదీన కానిస్టేబుల్ యాదగిరి రెడ్డి కరోనాతో మరణించిన విషయం తెలిసిందే. తాజాగా కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ లో ఎఎస్ఐగా పనిచేస్తున్న యూసుఫ్ కరోనాతో మరణించారు. చికిత్స పొందుతూ ఆయన ఇవాళ ఆసుపత్రిలోనే మరణించాడు.

also read:21 రోజుల్లోనే జీహెచ్ఎంసీలో 4622కి చేరిన కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య ఆదివారం నాటికి 7820కి చేరుకొన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా కేసులు నమోదౌతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 659 కేసులు నమోదయ్యాయి.పలువురు పోలీసులు కూడ కరోనాతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో లాక్ డౌన్ ను సమర్ధవంతంగా అమలు చేయడంలో పోలీస్ శాఖ కీలకపాత్ర పోషించింది. 

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?