కరోనా రోగుల డెడ్‌బాడీల మాయం: దర్యాప్తుకు సీపీ అంజనీకుమార్ ఆదేశం

Published : Jun 22, 2020, 03:31 PM IST
కరోనా రోగుల డెడ్‌బాడీల మాయం: దర్యాప్తుకు సీపీ అంజనీకుమార్ ఆదేశం

సారాంశం

కరోనా రోగుల మృతదేహాలు మాయమైన ఘటనపై దర్యాప్తు చేయాలని హైద్రాబాద్ సీపీ అంజనీకుమార్ స్పెషల్ బ్రాంచ్ పోలీసులను ఆదేశించారు. అన్ని పోలీస్ స్టేషన్లలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.


హైదరాబాద్: కరోనా రోగుల మృతదేహాలు మాయమైన ఘటనపై దర్యాప్తు చేయాలని హైద్రాబాద్ సీపీ అంజనీకుమార్ స్పెషల్ బ్రాంచ్ పోలీసులను ఆదేశించారు. అన్ని పోలీస్ స్టేషన్లలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

అదృశ్యమౌతున్న మృతదేహాలపై ప్రత్యేకంగా దర్యాప్తు చేయాలని ఆయన ఆదేశించారు. ఈ మేరకు స్పెషల్ బ్రాంచ్ అధికారులు చర్యలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.

also read:కరోనా పరీక్షలకు వెళ్లి 15 రోజులుగా అదృశ్యం: నరేందర్ సింగ్ కుటుంబసభ్యుల ఆందోళన

స్పెషల్ బ్రాంచ్ లో కీలకంగా పనిచేస్తున్న అధికారులను ఆయన అభినందించారు. కాలాపత్తర్ ఎఎస్ఐ యూసుఫ్ కరోనాతో ఇవాళ మరణించాడు. కరోనాతో  పోలీసు శాఖలో ఇవాళ్టికి ముగ్గురు మరణించారు. 

గాంధీ ఆసుపత్రిలో చేరిన మధుసూధన్ అనే వ్యక్తి కరోనాతో మరణించాడు. ఆయన అంత్యక్రియలను జీహెచ్ఎంసీ అధికారులు నిర్వహించారు. ఈ విషయమై మధుసూధన్ భార్య హైకోర్టును ఆశ్రయించింది. దీంతో ఈ విషయాన్ని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. 

మరోవైపు ఇదే రకమైన ఘటన గాంధీ ఆసుపత్రిలో చోటు చేసుకొంది. కరోనా పరీక్షలకు గాంధీ ఆసుపత్రికి వెళ్లిన నరేందర్ సింగ్ కన్పించకుండాపోయాడు. కరోనాతో ఆయన మరణించినట్టుగా పోలీసులు గుర్తించారు. చివరకు నిన్న నరేందర్ సింగ్ డెడ్ బాడీని కుటుంబసభ్యులకు అందించారు. 
 

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?