టమాటా సాగుతో కోటీశ్వరుడైన తెలంగాణ రైతు... సీఎం కేసీఆర్ ఆత్మీయ సత్కారం

Published : Jul 25, 2023, 11:34 AM IST
టమాటా సాగుతో కోటీశ్వరుడైన తెలంగాణ రైతు... సీఎం కేసీఆర్ ఆత్మీయ సత్కారం

సారాంశం

కేవలం టమాటాల అమ్మకం ద్వారా కోటీశ్వరుడైన తెలంగాణ రైతును స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆరే సెక్రటేరియట్ కు పిలిపించుకుని సన్మానించారు. 

హైదరాబాద్ : టమాటాలు... ప్రస్తుతం ఈ పేరు వింటేనే సామాన్యులు కంగారుపడిపోతున్నారు. ఆకాశాన్నంటిన టమాటా ధరలు పేద, మధ్యతరగతి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. కానీ ఇవే టమాటాలు కొందరు రైతులను రాజులను చేస్తున్నాయి. పెద్దపెద్ద వ్యాపారాలు, ఉద్యోగాలు చేసేవారు కూడా నెలలో కోట్లు సంపాదించలేరు... కానీ కొందరు టమాటా రైతులు రోజుల వ్యవధిలోనే కోట్ల రూపాయలు కళ్లజూస్తున్నారు. ఇలా తెలంగాణకు చెందిన రైతు మహిపాల్ రెడ్డి టమాటా పంట సాగుచేసి కోట్లు సంపాదించడమే కాదు అరుదైన గౌరవాన్ని అందుకున్నాడు.  స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మహిపాల్ రెడ్డి దంపతులను సెక్రటేరియట్ కు పిలిపించుకుని మరీ అభినందించడమే కాదు శాలువాతో సత్కరించారు. 

మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం మహ్మద్ నగర్ గ్రామానికి చెందిన బాన్సువాడ మహిపాల్ రెడ్డికి వంద ఎకరాల వ్యవసాయ భూమి వుంది. గతంలో ఎక్కువగా వరి సాగుచేసి ఆశించిన లాభాలు పొందలేకపోయిన ఆయన కూరగాయల సాగువైపు మళ్ళాడు. ఇలా దాదాపు 40 ఎకరాల్లో వివిధ రకాల కూరగాయలు సాగుచేస్తున్నాడు. అయితే ఈసారి అతడికి టమాటా రూపంలో జాక్ పాట్ తగిలింది.

ఈసారి టమాటాలు అమ్మడం ద్వారా రైతు మహిపాల్ రెడ్డి కోట్ల రూపాయలు సంపాందించాడు. ఇప్పటికే రెండు కోట్ల రూపాయల విలువైన టమాటాలు అమ్మగా మరో కోటి రూపాయల విలువైన పంట అమ్మకానికి సిద్దంగా వున్నట్లు 40ఏళ్ల ఈ రైతన్న చెబుతున్నాడు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని వ్యవసాయం చేయడమే కాదు ఎప్పటికప్పుడు మార్కెట్ పరిస్థితులను గమనిస్తూ వ్యవసాయాన్ని కొత్తపుంతలు తొక్కిస్తున్న మహిపాల్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టిలో పడ్డాడు. దీంతో అతడిని పిలిపించుకుని మరీ సన్మానించారు కేసీఆర్. 

Read More  రెండేళ్ల కిందట చికెన్, మందు పంపిణీ.. ఈ సారి టమాటాలు - మళ్లీ వార్తల్లో నిలిచిన బీఆర్ఎస్ నేత రాజనాల శ్రీహరి

నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి టమాటా రైతు మహిపాల్ రెడ్డి దంపతులను సెక్రటేరియట్ కు తీసుకువచ్చాడు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ రైతు దంపతులను అభినందించి శాలువా కప్పి సన్మానించారు. ఆర్థిక మంత్రి హరీష్ రావు, వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కూడా రైతు మహిపాల్ రెడ్డిని అభినందించారు. 

వాణిజ్య పంటల సాగు విషయంలో వినూత్నంగా ఆలోచించాలని... మార్కెట్ స్థితిగతులు అంచనా వేసి పంటలు పండించగలిగితే వ్యవసాయంలోనూ అద్భుతాలు సృష్టించవచ్చని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ రైతులు ఎప్పుడూ ఒకే పంట కాకుండా పంటమార్పిడి చేస్తుండాలని...  అలాగయితేనే మంచి ఫలితాలు వస్తాయన్నారు. ప్రస్తుతం టమాటా పంట రైతులను కోటీశ్వరులను చేస్తోందని... ఇలా లాభదాయక పంటలు సాగు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రైతులకు సూచించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?