ప్రభుత్వ భూముల విక్రయం... ఉమ్మడి రాష్ట్రంలోనే అడ్డుకున్నాం, అవసరమైతే ఉద్యమం: భట్టి విక్రమార్క

By Siva KodatiFirst Published Jun 13, 2021, 8:00 PM IST
Highlights

ప్రభుత్వ భూములను విక్రయించాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. భట్టి  నేతృత్వంలో వర్చువల్‌ విధానంలో ఆదివారం సీఎల్పీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, సర్కార్‌ తీసుకుంటున్న నిర్ణయాలు, ఉద్యమ కార్యాచరణపై నేతలు సుదీర్ఘంగా చర్చించారు

ప్రభుత్వ భూములను విక్రయించాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. భట్టి  నేతృత్వంలో వర్చువల్‌ విధానంలో ఆదివారం సీఎల్పీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, సర్కార్‌ తీసుకుంటున్న నిర్ణయాలు, ఉద్యమ కార్యాచరణపై నేతలు సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న అప్పులు చాలా ప్రమాదకరంగా మారాయని.. తెచ్చిన అప్పులను ఇష్టానుసారంగా, జవాబుదారీ లేకుండా ఖర్చు చేస్తున్నారని వారు మండిపడ్డారు.  

Also Read:తెలంగాణ: ప్రభుత్వ భూముల అమ్మకానికి కాంగ్రెస్ వ్యతిరేకం.. సీఎల్పీ అత్యవసర భేటీ

హైదరాబాద్‌లో ఉన్న వనరులను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని భట్టి విక్రమార్క అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా భూములు అమ్మకాలను అడ్డుకున్నామని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర గవర్నర్‌ను కలిసి భూముల అమ్మకాన్ని నిలుపుదల చేయాలని కోరతామని భట్టి తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం విక్రయించిన భూముల వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని భట్టి విక్రమార్క డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ భూముల వేలాన్ని అడ్డుకొని రాష్ట్రాన్ని కాపాడుకోవాలని.. ఇందుకోసం అవసరమైతే ఉద్యమాన్ని చేపడతామని సీఎల్పీ నేత హెచ్చరించారు.  

click me!