
మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఖరారు కావడంతో తెలంగాణ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. రేపు ప్రత్యేక విమానంలో అనుచరులతో కలిసి ఢిల్లీకి వెళ్లనున్నారు ఈటల. రాజేందర్‌తో పాటు 20 మందికి అపాయింట్‌మెంట్ ఇచ్చారు బీజేపీ పెద్దలు. రేపు ఉదయం 11.30కి బీజేపీలో చేరనున్నారు రాజేందర్.
ఇదిలావుంటే మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాకు స్పీకర్ ఆమోదం తెలిపారు. ఉదయం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ అసెంబ్లీ కార్యదర్శికి లేఖను అందజేయగా సాయంత్రమే ఆ రాజీనామాను అంగీకరించారు. ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసిన రాజేందర్ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు.
Also Read:టీఆర్ఎస్ షాక్... ఈటలకు మద్దతుగా భారీగా ఉప సర్పంచుల రాజీనామా
హుజురాబాద్ నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన ఈటలపై భూ కబ్జా ఆరోపణలు రావడంతో మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేశారు సీఎం కేసీఆర్. దీంతో టీఆర్ఎస్‌కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు ఈటల. ఈ సందర్భంగా... 17 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేశానని, యావత్ తెలంగాణ ప్రజల కోసం తాను రాజీనామా చేస్తున్నానని ఈటల చెప్పారు.