రూ. 500లకే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి పథకాలు: ప్రారంభించిన రేవంత్

By narsimha lode  |  First Published Feb 27, 2024, 5:10 PM IST


అధికారంలోకి వచ్చిన తర్వాత  ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుపై  కాంగ్రెస్ ప్రభుత్వం  కసరత్తు చేస్తుంది.


హైదరాబాద్:  రూ. 500 లకే గ్యాస్ సిలిండర్,  200 యూనిట్ల వరకు గృహావసరాలకు  ఉచిత విద్యుత్ పథకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి మంగళవారంనాడు  ప్రారంభించారు.తెలంగాణ సచివాలయంలో  ఇవాళ  రూ. 500లకే గ్యాస్ సిలిండర్,  గృహజ్యోతి (200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్)ను  మంత్రులతో కలిసి తెలంగాణ సీఎం  రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి  ప్రసంగించారు.

 

Latest Videos

పేదల ఇంట్లో వెలుగులు నింపేందుకు సోనియాగాంధీ ఆరు గ్యారంటీలను తెలంగాణ ప్రజలకు అంకితమిచ్చారన్నారు. సోనియాగాంధీపై విశ్వాసంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం కట్టబెట్టారని  రేవంత్ రెడ్డి  చెప్పారు. 

also read:రేషన్ కార్డుంటేనే రూ. 500లకు గ్యాస్ సిలిండర్: నిబంధనలు ఇవీ..

నిజమైన లబ్ధిదారులకు, అర్హులకు పథకాలను అందించడమే ప్రజా పాలన ఉద్దేశ్యమని తెలిపారు. ఎన్నికల ముందు  ఇచ్చిన  హామీల భాగంగా ఇవాళ 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500లకే గ్యాస్ సిలిండర్ పథకాలు ప్రారంభించుకుంటున్నామన్నారు.ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఈ పథకాలను సచివాలయంలో లాంఛనంగా ప్రారంభించుకుంటున్నట్టుగా  రేవంత్ రెడ్డి తెలిపారు.

also read:త్వరలోనే జీనోమ్ వ్యాలీ రెండో ఫేజ్ ఏర్పాటు: బయో ఏషియా 2024 సదస్సు ప్రారంభించిన రేవంత్

మహిళల కళ్లలో ఆనందం చూడాలనే రూ.500 గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభిస్తున్నట్టుగా రేవంత్ రెడ్డి చెప్పారు.పేదలకు పథకాలు చేరేలా అధికారులు విధి విధానాలు రూపొందించారని సీఎం గుర్తు చేశారు. ఆర్ధిక నియంత్రణ పాటిస్తూ పేదలకు ఇబ్బంది కలగకుండా పథకాలు అమలు చేస్తున్నామన్నారు.హామీలు అమలు చేయడంలో తమ ప్రభుత్వం నిబద్ధతతో ఉందని రేవంత్ రెడ్డి  తెలిపారు. 

also read:నాగర్ కర్నూల్ ఎంపీ టిక్కెట్టు:మల్లు రవి, సంపత్ మధ్య పోటా పోటీ...

తమ ప్రభుత్వంపై తండ్రీ కొడుకులు, మామా అల్లుళ్లు తప్పుడు ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని  బీఆర్ఎస్ నేతలపై  రేవంత్ రెడ్డి పరోక్షంగా విమర్శలు చేశారు.  సోనియమ్మ మాట ఇచ్చారంటే అది శిలాశాసనమన్నారు. సోనియా గాంధీ ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.

Watch Live: CM Sri launching 'LPG Cylinder at ₹500' and 'free domestic power supply up to 200 units' Schemes for the poor. https://t.co/8JQC0Y12yT

— Telangana CMO (@TelanganaCMO)

also read:గగన్ యాన్‌: అంతరిక్షయాత్రలో పాల్గొనే భారత వ్యోమగాములు వీరే

గత ఏడాది నవంబర్ మాసంలో  అసెంబ్లీ ఎన్నికల సమయంలో  కాంగ్రెస్ పార్టీ ఆరు హామీలను  ఇచ్చింది.ఈ హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది.  గతంలో రెండు హామీలను అమలు చేసింది. ఇవాళ రెండు హామీలను అమలు చేసింది.
 

click me!