రాష్ట్రంలో ఇసుకతో పాటు జీఎస్టీ రెవిన్యూ పెరిగిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఆదాయ పన్ను చెల్లించేవారికి రైతు బంధు ఎందుకని ఆయన ప్రశ్నించారు.
హైదరాబాద్:తమ పాలనపై రిఫరెండంగా పార్లమెంట్ ఎన్నికలకు వెళ్తామని తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాల్లో 14 కు పైగా సీట్లలో విజయం సాధిస్తామని రేవంత్ రెడ్డి ధీమాను వ్యక్తం చేశారు.మంగళవారంనాడు హైద్రాబాద్‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. తమ కుటుంబం నుండి ఎవరూ కూడ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ లా తాను ప్రధాని చెవిలో గుసగుసలు చెప్పలేదన్నారు.తాను అంతా బహిరంగంగానే చెప్పానన్నారు.
also read:అద్భుతం: హుగ్లీ నది దిగువన మెట్రో రైలు సేవలు, ప్రారంభించనున్న మోడీ
undefined
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రోజు కు రెండున్నర కోట్ల ఇసుక ఆదాయం పెరిగిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మరో వైపు జీఏస్టీ ద్వారా రూ. 500 కోట్ల ఆదాయం పెరిగిందని సీఎం వివరించారు.సీఎంఆర్ఎఫ్ పై అంతర్గతంగా ఆడిట్ జరుగుతుందన్నారు. సీఎంఆర్ఎఫ్ లో అవకతవకలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
also read:నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం: నవదంపతులు సహా ఐదుగురు మృతి
ఆదాయ పన్ను చెల్లించే వారికి రైతు బంధు ఎందుకని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. వ్యవసాయం చేసే వారికే రైతు బంధు అని ఆయన తేల్చి చెప్పారు. అయితే ఈ విషయమై అసెంబ్లీ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.అన్ని ప్రైవేటు యూనివర్సిటీల పై విచారణ జరుపుతామని సీఎం చెప్పారు.ఎల్ఆర్ఎస్ పై బీఆర్ఎస్ ఆందోళన విషయమై రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ విషయమై చేసే ఆందోళనలో కేటీఆర్ రోజంతా ధర్నా చేయాలని ఆయన సూచించారు. ఎల్ఆర్ఎస్ పై అధికారుల నివేదిక వచ్చిన తర్వాత స్పష్టత ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు.సస్పెన్షన్ కు గురైన ప్రణీత్ రావు వ్యవహరంపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేస్తుందన్నారు. జీవో 3 పై కోర్టు ఆదేశాలను అమలు చేస్తున్నట్టుగా ఆయన తెలిపారు.
also read:పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ కసరత్తు: జాబితా రెడీ, రాహుల్ పోటీపై రాని స్పష్టత
రాహుల్ గాంధీ తెలంగాణలో పోటీ చేస్తే రాష్ట్ర గౌరవం పెరుగుతుందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.కేసీఆర్ వందేళ్ల విధ్వంసం చేస్తే వంద రోజుల్లో పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు.
తనను ఇతర పార్టీ ఎమ్మెల్యేలు కలవడం లో ఎలాంటి రాజకీయం లేదన్నారు.సీఎంను ఎమ్మెల్యేలు కలిస్తే ఏదో జరుగుతున్నట్లు గా కేసీఆర్ చేశాడన్నారు.
మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల విషయంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించనుందని సీఎం తెలిపారు.తమ ప్రభుత్వం ఎందుకు పడిపోతుందో ఆ వ్యాఖ్యలు చేసిన వారే చెప్పాలన్నారు. అసెంబ్లీకి రాని నేత ప్రతిపక్ష నేత ఎలా అవుతారని పరోక్షంగా కేసీఆర్‌నుద్దేశించి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
also read:ఫోన్ ట్యాప్ ఆరోపణలు: పోలీస్ అధికారి ప్రణీత్ రావుపై రేవంత్ సర్కార్ సస్పెన్షన్ వేటు
దేశానికి ప్రధాని పెద్దన్నే కదా అని రేవంత్ రెడ్డి చెప్పారు. కేసీఆర్ లా తాను ప్రధాని చెవిలో గుసగుసలు చెప్పలేదన్నారు. అంతా బహిరంగంగా చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి వివరించారు.బీజేపీ నేతలు ప్రధానిని తప్పుదోవ పట్టించారని రేవంత్ రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం పై 4 వారాల్లో నివేదిక ఇస్తే ఎన్నికల లోపే చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించి ఆదిలాబాద్ కు నీళ్లు ఇస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ అంతర్గత ఒప్పందంతో టికెట్ లను ప్రకటించారని ఆయన విమర్శించారు.మెదక్ లో బీఆర్ఎస్ అభ్యర్థిని ఎందుకు ప్రకటించలేదని ఆయన ప్రశ్నించారు.