పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ కసరత్తు: జాబితా రెడీ, రాహుల్ పోటీపై రాని స్పష్టత

By narsimha lode  |  First Published Mar 6, 2024, 6:39 AM IST

పార్లమెంట్ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ అత్యంత సీరియస్ గా తీసుకుంది.ఈ ఎన్నికల్లో తెలంగాణ నుండి మెజారిటీ సీట్లను దక్కించుకోవాలని ఆ పార్టీ ప్లాన్ చేస్తుంది. 



హైదరాబాద్: ఈ నెల 7, 8 తేదీల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించనున్నారు. రాష్ట్రంలోని  17 పార్లమెంట్ స్థానాల్లో  అభ్యర్థుల ఎంపిక కోసం  వచ్చిన ధరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి  స్క్రీనింగ్ కమిటీ  కేంద్ర ఎన్నికల కమిటీకి పంపారు. ఈ నెల  7న కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం  జరగనుంది.ఈ సమావేశంలో  తెలంగాణ నుండి పంపిన అభ్యర్థుల జాబితాకు  ఆమోదం తెలిపిన తర్వాత అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది.  కాంగ్రెస్ ప్రకటించే తొలి జాబితాలో  ఏడు నుండి తొమ్మిది మంది పేర్లు ఉండే అవకాశం ఉంది.

also read:ఫోన్ ట్యాప్ ఆరోపణలు: పోలీస్ అధికారి ప్రణీత్ రావుపై రేవంత్ సర్కార్ సస్పెన్షన్ వేటు

Latest Videos

undefined

తెలంగాణ రాష్ట్రంలోని  17 పార్లమెంట్ ఎంపీ స్థానాల్లో మెజారిటీ స్థానాలను దక్కించుకోవాలని ఆ పార్టీ ప్లాన్ చేస్తుంది.పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు 309 మంది ధరఖాస్తు చేసుకున్నారు. అయితే గెలిచే అభ్యర్ధులను బరిలోకి దింపాలని కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. మరో వైపు సామాజిక సమీకరణాలను కూడ దృష్టిలో ఉంచుకోవాలని ఆ పార్టీ భావిస్తుంది. 

also read:విశాఖపట్టణంలోనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తా: ఏపీ రాజధానిపై జగన్ సంచలనం

గత వారంలో  కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ సభ్యులు హైద్రాబాద్ లో భేటీ అయ్యారు.ఈ సమావేశంలో   ఎంపీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థు ఎంపికపై కసరత్తు చేశారు.  ఏకాభిప్రాయం కుదిరిన స్థానాల జాబితాను కేంద్ర ఎన్నికల కమిటీకి పంపారు.

ప్రతిపాదించిన అభ్యర్థుల జాబితా

మహబూబ్‌నగర్: వంశీచంద్ రెడ్డి
జహీరాబాద్:సురేష్ షెట్కార్
నల్గొండ:రఘువీర్ రెడ్డి/జానారెడ్డి
చేవేళ్ల:పట్నం సునీత మహేందర్ రెడ్డి
నిజామాబాద్:జీవన్ రెడ్డి
పెద్దపల్లి:గడ్డం వంశీ
సికింద్రాబాద్:బొంతు రామ్మోహన్
మహబూబాబాద్:బలరాం నాయక్
భువనగిరి:చామల కిరణ్ కుమార్ రెడ్డి

ఈ నెల రెండో వారంలో పార్లమెంట్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే అభ్యర్థుల ప్రకటన చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది.

also read:టీడీపీలో చేరుతా:వైఎస్ఆర్‌సీపీకి గుమ్మనూరు జయరాం రాజీనామా

పార్లమెంట్ ఎన్నికల్లో  మెజారిటీ సీట్లను దక్కించుకోవాలని రాష్ట్ర నేతలు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని తెలంగాణ నుండి పోటీ చేయాలని కూడ కోరారు. రాహుల్ గాంధీ తెలంగాణలోని ఖమ్మం, నల్గొండ, భువనగిరి ఎంపీ సీట్లలో  ఏదో ఒక స్థానం నుండి  బరిలోకి దింపాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తుంది. అయితే ఈ విషయమై  రాహుల్ గాంధీ నుండి స్పష్టత రావాల్సి ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు.

click me!