కేంద్రంలో మేం అధికారంలో ఉన్నాం.. గుర్తుంచుకోండి: టీఆర్ఎస్ నేతలపై సంజయ్ ఆగ్రహం

By Siva KodatiFirst Published Jul 12, 2020, 10:11 PM IST
Highlights

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై దాడిని ఖండించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్. తెలంగాణ ప్రజలు కరోనాకు భయపడితే.. టీఆర్ఎస్ నేతలకు బీజేపీ భయం పట్టుకుందన్నారు

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై దాడిని ఖండించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్. తెలంగాణ ప్రజలు కరోనాకు భయపడితే.. టీఆర్ఎస్ నేతలకు బీజేపీ భయం పట్టుకుందన్నారు.

బీజేపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేపులు పెట్టినా ఎప్పుడు రాజ్యాంగాన్ని అతిక్రమించలేదని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమార్తె కవితపై ఎన్ని కేసులు ఉన్నాయో ప్రజలందరికీ తెలుసునని సంజయ్ ఎద్దేవా చేశారు.

బీజేపీ సిద్ధాంతం కలిగిన పార్టీ అని.. టీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సిద్థాంతాలు లేవని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలపై దాడులకు పాల్పడితే సరైన సమాధానం చెప్పాల్సి వుంటుందని బండి స్ఫష్టం చేశారు.

Also Read:ఎంపీ ధర్మపురి వ్యాఖ్యలు: వరంగల్‌ బీజేపీ ఆఫీసు ఎదుట టీఆర్ఎస్ ధర్నా

దాడులతో ప్రతిపక్షాలను కట్టడి చేద్దామనుకోవడం మూర్ఖత్వమేనన్న ఆయన ముందస్తు ప్రణాళిక ప్రకారమే దాడికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్న సంజయ్.. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని టీఆర్ఎస్ గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు.

టీఆర్ఎస్‌ నేతలు అవినీతికి పాల్పడలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత వారిపై ఉందని గుర్తుచేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ వాటా లేని పథకాలు ఎన్నో చెప్పాలని సంజయ్ డిమాండ్ చేశారు. 
 

click me!