తెలంగాణలో 34 వేలు దాటిన కరోనా: 24 గంటల్లో 1,269 కేసులు.. 8 మంది మృతి

Siva Kodati |  
Published : Jul 12, 2020, 09:08 PM ISTUpdated : Jul 13, 2020, 01:20 PM IST
తెలంగాణలో 34 వేలు దాటిన కరోనా: 24 గంటల్లో 1,269 కేసులు.. 8 మంది మృతి

సారాంశం

తెలంగాణలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. ఆదివారం కొత్తగా 1,269 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 34,671కి చేరింది

తెలంగాణలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. ఆదివారం కొత్తగా 1,269 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 34,671కి చేరింది.

గడిచిన 24 గంటల్లో వైరస్ కారణంగా 8 మంది ప్రాణాలు కోల్పోవడంతో.. మొత్తం మృతుల సంఖ్య 356కి చేరుకుంది. ప్రస్తుతం తెలంగాణలో 28,482 మంది కోలుకుని డిశ్చార్జవ్వగా... 11,883 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Also Read:రాజ్‌భవన్‌లో 10 మందికి కరోనా: తెలంగాణ గవర్నర్‌ తమిళిసైకి నెగిటివ్

ఒక్క హైదరాబాద్‌లోనే 800 మందికి పాజిటివ్‌గా తేలగా... రంగారెడ్డి 132, మేడ్చల్ 94, సంగారెడ్డి 36, వరంగల్ అర్బన్ 12, వరంగల్ రూరల్ 2, నిర్మల్ 4, కరీంనగర్ 23, జగిత్యాల 4, యాదాద్రి 7, మహబూబాబాద్ 8, పెద్దపల్లి 9, మెదక్ 14, మహబూబ్‌నగర్ 17, మంచిర్యాల, భద్రాద్రి జిల్లాలో మూడేసి కేసులు, నల్గొండ 15, సిరిసిల్ల 3, ఆదిలాబాద్ 4, వికారాబాద్‌ 6, నాగర్‌కర్నూల్ 23, జనగాం 6, నిజామాబాద్ 11, వనపర్తి 15, సిద్ధిపేట 3, సూర్యాపేట 7, గద్వాల్‌ 7 కేసులు నమోదయ్యాయి.

కాగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఈ నెల 13వ తేదీ నుండి 10 రోజుల పాటు లాక్ డౌన్ నిర్వహించనున్నారు. ఇవాళ నిర్వహించిన మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పది రోజుల పాటు లాక్ డౌన్ నిర్వహించడం ద్వారా కరోనా వ్యాప్తిని తగ్గించవచ్చని భావిస్తున్నారు.

Also Read:కరోనాను జయించినా వదలని మృత్యువు.. ఇంటికి వెళ్తుండగా

పెద్దపల్లిలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్న తరుణంలో  ఈ నిర్ణయం తీసుకొన్నారు. ఆదివారం నాడు కరోనాతో ఒక్కరు మరణించారు. దీంతో 10 రోజుల పాటు స్వచ్చంధంగా లాక్ డౌన్ పాటించాలని నిర్ణయం తీసుకొన్నారు. 

PREV
click me!

Recommended Stories

Kalvakuntla Kavitha: కొడంగల్‌లో 22 వేల డూప్లికేట్ ఓట్లు? కవిత సంచలన కామెంట్స్| Asianet News Telugu
Rugby Premier League: ముంబైని చితక్కొట్టిన హైదరాబాద్ హీరోస్.. గచ్చిబౌలిలో చిరంజీవి, పీవీ సింధు హంగామా