రాజ్‌భవన్‌లో 10 మందికి కరోనా: తెలంగాణ గవర్నర్‌ తమిళిసైకి నెగిటివ్

By narsimha lode  |  First Published Jul 12, 2020, 6:17 PM IST

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కరోనా పరీక్షలు చేయించుకొన్నారు. నెగిటివ్ వచ్చినట్టుగా తమిళిసై ప్రకటించారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.



హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కరోనా పరీక్షలు చేయించుకొన్నారు. నెగిటివ్ వచ్చినట్టుగా తమిళిసై ప్రకటించారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

హైద్రాబాద్ రాజ్ భవన్ లో పనిచేస్తున్న సుమారు 10 మంది సిబ్బందికి కరోనా సోకింది. దీంతో గవర్నర్ తమిళిసై ఆదివారం నాడు కరోనా పరీక్షలు చేయించుకొన్నారు. అయితే ఆమెకు ఈ పరీక్షల్లో నెగిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించారు.

I got tested today for and negative I appeal people who are in Red zones or with Contact history kindly get it done at the earliest. Early diagnosis not only to protect us but also others.Don't hesitate! Test yourself Motivate others! Follow 4Ts TEST TRACE TREAT TEACH

— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv)

Latest Videos

undefined

 

రెడ్ జోన్లలో ఉన్నవారు పరీక్షలు నిర్వహించుకోవాలని ఆమె సూచించారు. దీని ద్వారా ప్రతి ఒక్కరిని రక్షించుకొనే అవకాశంతో పాటు ఇతరులను కూడ  రక్షించినవారు అవుతారని ఆమె అభిప్రాయపడ్డారు.

కరోనా పరీక్షలు చేయించుకొనేలా ప్రతి ఒక్కరిని ప్రోత్సహించాలని ఆమె కోరారు.కరోనా రోగులకు చికిత్సల విషయంలో ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలతో గవర్నర్  తమిళిసై సౌందరరాజన్ ఈ నెల 7వ తేదీన సమావేశం నిర్వహించారు.

కరోనాపై సమీక్ష: గవర్నర్ తమిళసైకి తెలంగాణ అధికారులు షాక్

ఈ నెల 6వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీతో  తమిళిసై సమావేశం కావాలని భావించారు. అయితే ముందుగా షెడ్యూల్ చేసుకొన్న కార్యక్రమాల నేపథ్యంలో ఈ సమావేశానికి రాలేమని అధికారులు గవర్నర్ కు చెప్పారు.

కానీ, ఈ నెల 7వ తేదీన గవర్నర్ తో ఈ ఇద్దరు కీలక అధికారులు సమావేశమయ్యారు. రాష్ట్రంలో కరోనా రోగులకు అందుతున్న చికిత్స, రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఆమె చర్చించారు.

click me!