బీజేపీ నేతలతో నేడు అమిత్ షా భేటీ: తెలంగాణపై కాషాయ దళం ఫోకస్

By narsimha lodeFirst Published Dec 21, 2021, 12:11 PM IST
Highlights

తెలంగాణ బీజేపీ నేతలతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇవాళ భేటీ కానున్నారు. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై అమిత్ షా చర్చించనున్నారు. ఇప్పటికే తెలంగాణపై బీజేపీ నాయకత్వం ఫోకస్ పెట్టింది. ఈ తరుణంలో ఈ భేటీకి రాజకీయంగా ప్రాధాన్యత నెలకొంది.

హైదరాబాద్: Telangana రాష్ట్రంలో Bjp, Trs మధ్య Paddy ధాన్యం కొనుగోలు విషయమై మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకొన్న తరుణంలో బీజేపీ నేతలు కేంద్ర హోంశాఖ మంత్రి Amit shah తో ఇవాళ బేటీ కానున్నారు ఈ భేటీకి రాజకీయంగా ప్రాధాన్యత నెలకొంది.తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫోకస్ పెట్టారు. రాష్ట్రంలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో  బీజేపీ అభ్యర్ధులు విజయం సాధించారు.  దీంతో రాష్ట్రంపై బీజేపీ  జాతీయ నాయకత్వం కేంద్రీకరించింది.  ఇతర పార్టీల నుండి బీజేపీలో చేరిన నేతలకు కూడా బీజేపీలో పెద్ద పీట వేసింది ఆ పార్టీ నాయకత్వం.

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో   తెలంగాణ నుండి అధిక సీట్లు దక్కించుకొనేందుకు బీజేపీ నాయకత్వం ప్లాన్ చేసింది. గత ఎన్నికల్లో తెలంగాణ నుండి బీజేపీ నాలుగు ఎంపీ స్థానాలను గెలుచుకొంది. అయితే వచ్చే ఎన్నికల్లో గతంలో కంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధించాలని  బీజేపీ నాయకత్వం ప్లాన్ చేస్తోంది.టీఆర్ఎస్ నుండి బహిష్కరణకు గురైన  మాజీ మంత్రి Etela Rajender  బీజేపీలో చేరి హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం నుండి విజయం సాధించారు.  ఈ విజయం బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహన్ని నింపింది.

Latest Videos

also read:వరి ధాన్యం ఇష్యూ: తెలంగాణ మంత్రులకు షాకిచ్చిన పీయూష్ , ముందే బీజేపీ నేతలకు అపాయింట్ మెంట్

Paddy ధాన్యం కొనుగోలు అంశంపై రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం సాగుతుంది. యాసంగిలో వరి ధాన్యం కొనుగోలుపై కేంద్రం నుండి స్పష్టత కోరుతూ టీఆర్ఎస్ యుద్ధం ప్రకటించింది. అయితే వర్షాకాలంలో వరి ధాన్యం కొనుగోలుపై టీఆర్ఎస్ తీరుపై బీజేపీ విమర్శలను ఎక్కు పెట్టింది. ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తోంది. అంతేకాదు రాష్ట్రం తమకు ఇచ్చిన  టార్గెట్ ను పెంచాలని కూడా కోరుతుంది. ఇదే విషయమై కేంద్రంతో చర్చించేందుకు రాష్ట్ర మంత్రులు ఢిల్లీ బాట పట్టారు.  ఈ తరుణంలోనే  బీజేపీ నేతలకు కేంద్ర మంత్రి అమిత్ షా బేటీ కానున్నారు.

తెలంగాణ మంత్రులు కేంద్ర మంత్రి Piyush Goyal  తో భేటీ కావడానికి ముందే  తెలంగాణకు చెందిన బీజేపీ నేతలతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కూడా అపాయింట్ మెంట్ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకొంది.  వరి ధాన్యం కొనుగోలుపై  కేంద్రంపై, బీజేపీని లక్ష్యంగా చేసుకొని టీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాంపై కూడా కేంద్ర మంత్రితో  బీజేపీ నేతలు చర్చించనున్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో  బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై  కూడా కేంద్ర మంత్రి అమిత్ షా దిశా నిర్ధేశం చేయనున్నారు.

దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ జాతీయ నాయకత్వం ఫోకస్ పెట్టింది. దక్షిణాదిలోని తెలంగాణపై ఆ పార్టీ  కేంద్రీకరించింది. తెలంగాణ నుండి కేంద్ర మంత్రివర్గంలో ఉన్న Kishan Reddy కి ఇటీవలనే ప్రమోషన్ ఇచ్చారు. సహాయ మంత్రి నుండి కేబినెట్ మంత్రి పదవికి కిషన్ రెడ్డికి ప్రమోషన్  దక్కింది..2023 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడం కోసం  బీజేపీ రాష్ట్ర నాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.  

click me!