వరి ధాన్యం కొనుగోలు విషయమై తెలంగాణకు చెందిన మంత్రుల బృందం ఇవాళ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో భేటీ కానున్నారు. వానాకాలంలో వరి ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి టార్టెట్ పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరనుంది.
హైదరాబాద్: Paddy ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి Telangana కు చెందిన మంత్రుల బృందం మంగళవారం నాడు మధ్యాహ్నం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో సమావేశం కానుంది.ఖరీఫ్ సీజన్ లో( వానాకాలంలో ) ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి కేంద్రం నుండి స్పష్టత రావాలని కోరుకొంటుంది తెలంగాణ ప్రభుత్వం.వానా కాలంలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం 42 లక్షల మెట్రిక్ టన్నుల టార్గెట్ ఇచ్చింది. ఇప్పటికే 60 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించామని తెలంగాణ మంత్రి niranjan reddy తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో మరో 12 నుంచి 15 లక్షల టన్నుల ధాన్యం నిల్వ ఉంది.భూపాలపల్లి, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో వరి కోతలే జరగని విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం గుర్తు చేస్తోంది.
జనవరి 15 వరకు వరి కోతలు కొనసాగుతాయని తెలంగాణ అధికారుులు చెబుతున్నారు. 40 లక్షల టన్నుల బియ్యం/60 లక్షల టన్నుల వడ్ల సేకరణకు కేంద్రంతో రాష్ట్రానికి ఎంవోయూ కుదిరిందని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గుర్తు చేస్తున్నారు. రాష్ట్రానికి ఇచ్చిన టార్గెట్ ను పెంచాలని గతంలోనే రెండుసార్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి వచ్చి కేంద్రంతో చర్చించారని మంత్రి నిరంజన్ రెడ్డి గుర్తు చేస్తున్నారు.
undefined
also read:స్వయంగా చావు డప్పు కొట్టిన మంత్రి శ్రీనివాస్ గౌడ్... మహబూబ్ నగర్ లో టీఆర్ఎస్ నిరసన (ఫోటోలు)
యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు విషయమై కేంద్రం నుండి స్పష్టత రాలేదు. అయితే యాసంగిలో వరి ధాన్యం పండించవద్దని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తేల్చి చెప్పింది. యాసంగిలో తెలంగాణ రాష్ట్రంలో బాయిల్డ్ రైస్ మాత్రమే వస్తోంది. అయితే బాయిల్డ్ రైస్ ను కొనుగోలు చేయలేమని కేంద్రం తెగేసి చెప్పింది. దీంతో రా రైస్ విషయంలో మార్చిలో ప్రకటన చేస్తామని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రకటించింది. దీంతో యాసంగిలో వరి ధాన్యం పండించవద్దని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చెప్పింది. మరో వైపు ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా ఉండవని కూడా రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది.
అయితే వానా కాలం వరి ధాన్యం కొనుగోలు విషయమై కూడ కేంద్ర ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది. ఈ విషయమై వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి నేతృత్వంలోని మంత్రుల బృందం రెండు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసింది.పార్లమెంట్ లో సోమవారం నాడు కేంద్ర మంత్రి Piyush Goyal తో Trs ఎంపీల బృందం భేటీ అయింది. రాష్ట్ర మంత్రులు వరి ధాన్యం కొనుగోళ్లపై చర్చించడానికి వచ్చిన విషయాన్ని ఎంపీల బృందం తెలిపింది. దీంతో ఇవాళ మధ్యాహ్నం మంత్రుల బృందానికి పీయూష్ గోయల్ అపాయింట్ మెంట్ ఇచ్చారు.
వరి ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి బీజేపీ, టీఆర్ఎస్ లు రాజకీయంగా పైచేయి సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఖరీఫ్ సీజన్ లో వరి ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ ఎదురుదాడిని ప్రారంభించింది. అయితే ఈ సమయంలోనే టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన టార్టెట్ ను పెంచాలని కోరుతుంది. ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి బంతిని కేంద్రం కోర్టులో నెట్టేందుకు ప్రయత్నిస్తోందనే అభిప్రాయాలను రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ బీజేపీ నేతలకు పీయూష్ గోయల్ అపాయింట్ మెంట్
తెలంగాణ రాష్ట్రంలోని Bjp నేతలకు ఇవాళ మధ్యాహ్నం పన్నెండు గంటలకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అపాయింట్ మెంట్ ఇచ్చారు. తెలంగాణ మంత్రుల బృందం కంటే ముందే బీజేపీ నేతలకు అపాయింట్ మెంట్ ఇవ్వడం ప్రస్తుతం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది.