నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లు ఎన్నికల్లో పోటీ చేయొద్దు.. సునీల్ బన్సల్ వ్యాఖ్యలు , షాకైన బీజేపీ నేతలు

Siva Kodati |  
Published : Oct 08, 2022, 08:27 PM IST
నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లు ఎన్నికల్లో పోటీ చేయొద్దు.. సునీల్ బన్సల్ వ్యాఖ్యలు , షాకైన బీజేపీ నేతలు

సారాంశం

తెలంగాణలో బీజేపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లకు రాష్ట్ర పార్టీ ఇన్‌ఛార్జ్ సునీల్ బన్సల్ షాకిచ్చారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు ఎన్నికల్లో పోటీ చేయొద్దని ఆయన సూచించారు. వెంటనే బండి సంజయ్ జోక్యం చేసుకోవడంతో నేతలు ఊపిరి పీల్చుకున్నారు.   

తెలంగాణలో బీజేపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లకు రాష్ట్ర పార్టీ ఇన్‌ఛార్జ్ సునీల్ బన్సల్ షాకిచ్చారు. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో సునీల్ బన్సల్, తరుణ్‌చుగ్‌లు శనివారం భేటీ అయ్యారు. ఈ కార్యక్రమానికి కొత్తగా నియమించిన నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా కొందరు ఇన్‌ఛార్జ్‌లు తమను తప్పించాలని కోరారు. దీనికి స్పందించిన బన్సాల్.. ఆరు నెలలు పనిచేయాలని, ఆతర్వాత తప్పిస్తామని చెప్పడంతో మిగిలిన ఇన్‌ఛార్జ్‌లు షాకయ్యారు. అంతేకాదు.. బీజేపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు ఎన్నికల్లో పోటీ చేయొద్దని సునీల్ చెప్పారు. పరిస్ధితి ఇబ్బందికరంగా మారడంతో వెంటనే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ జోక్యం చేసుకోవడంతో నేతలు ఊపిరి పీల్చుకున్నారు. 

ఇకపోతే.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉపఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ సభ్యత్వానికి రాజీనామా  చేసిన రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు. ఆయన బీజేపీ నుంచి మునుగోడు ఉప ఎన్నిక బరిలో దిగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో.. బీజేపీ తమ పార్టీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరును శనివారం అధికారికంగా ప్రకటించింది. దీంతో ఆయన సోమవారం తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మునుగోడు ప్రజలకు, కేసీఆర్కు మధ్య ఈ పోటీ జరుగుతుందన్నారు. మునుగోడులో జరుగుతున్న ధర్మయుద్ధంలో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.  

ALso REad:నవంబర్ రెండో వారంలో మునుగోడు ఉపఎన్నిక...సీరియస్‌గా తీసుకోండి, బీజేపీ నేతలతో సునీల్ బన్సల్

ఇదిలా ఉంటే.. మునుగోడు ఉప ఎన్ని నవంబర్ 3వ తేదీన జరగనున్న సంగతి తెలిసిందే. నవంబర్ 6వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి బరిలో దిగనుండగా.. టీఆర్ఎస్ తమ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ప్రకటించింది. ఇప్పటికే మునుగోడులో విజయం కోసం బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్.. అన్ని విధాలుగా సిద్దమయ్యాయి. క్షేత్ర స్థాయిలో ఓటర్ల మద్దతు కూడగట్టేలా ప్రయత్నాలు ప్రారంభించాయి. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే