24న కాదు.. ఒకరోజు ముందుగానే తెలంగాణలోకి రాహుల్ పాదయాత్ర, షెడ్యూల్ ఇదే

By Siva KodatiFirst Published Oct 8, 2022, 7:42 PM IST
Highlights

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్ర ఒకరోజు ముందుగానే తెలంగాణలోకి ప్రవేశించనుంది. షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 24న రాహుల్ యాత్ర రాష్ట్రంలోకి అడుగుపెట్టాలి.. కానీ 23వ తేదీనే ఆయన ఎంటర్ కానున్నారు. 

ఒకరోజు ముందుగానే తెలంగాణలోకి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పాదయాత్ర చేరుకోనుంది. ఈ నెల 23న తెలంగాణలోకి రాహుల్ గాంధీ ఎంటర్ కాబోతున్నారు. 23న హాఫ్ డే మాత్రమే ఆయన పాదయాత్ర చేస్తారు. 24, 25న పాదయాత్రకు బ్రేక్ వుంటుంది. 26 నుంచి రాహుల్ యాత్ర తిరిగి కొనసాగుతుంది. ప్రస్తుతం ఆయన భారత్ జోడో యాత్ర కర్ణాటకలో కొనసాగుతోంది. రాహుల్ గాంధీ యాత్ర తెలంగాణ కాంగ్రెస్‌కు బూస్టప్ ఇస్తుందని బలంగా నమ్ముతున్నారు నేతలు. సక్సెస్ చేసేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే రూట్ మ్యాప్ కూడా ఖరారైంది. మొత్తం 13 రోజుల పాటు 375 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. కర్ణాటకలోని రాయచూర్ నుంచి ముక్తల్‌లోకి రాహుల్ పాదయాత్ర ప్రవేశించనుంది. 

అయితే తొలుత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర..  ఔటర్ రింగ్ రోడ్, వికారబాద్‌ మీదుగా వెళ్లేలా ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు ఆ ప్లాన్‌లో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. తాజా రూట్ మ్యాప్ ప్రకారం.. రాహుల్ గాంధీ పాదయాత్ర శంషాబాద్, ఆరామ్‌గఢ్, చార్మినార్, అఫ్జల్‌గంజ్, మోజంజాహీ మార్కెట్, గాంధీభవన్, నాంపల్లి దర్గా, విజయనగర్ కాలనీ, నాగార్జున సర్కిల్, పంజాగుట్ట, అమీర్‌పేట్, కూకట్‌పల్లి, మియాపూర్, పటాన్‌చెరు సహా నగరంలోని ప్రధాన ప్రాంతాల గుండా వెళుతుంది. 

ALso REad:రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొన్న సోనియా గాంధీ.

అయితే చార్మినార్‌ నుంచి రాహుల్ గాంధీ పాదయాత్ర వెళ్లనున్న నేపత్యంలో.. అక్కడి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని రాహుల్ సందర్శించేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇక, తెలంగాణలో జరగనున్న రాహుల్ గాంధీ భారత్‌ జోడో పాదయాత్రకు భద్రత కల్పించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ నేతలు.. డీజీపీ మహేందర్ రెడ్డిని కూడా కలిశారు. భద్రతా ఏర్పాట్లు చేసేందుకు డీజీపీ అంగీకరించారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియాకు తెలిపారు. ఇదిలా ఉంటే.. రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రస్తుతం కర్ణాటకలో కొనసాగుతుంది. అక్టోబర్ 24 న తెలంగాణలోకి ప్రవేశించనుంది.

ఇక, రాహుల్ పాదయాత్రపై సమన్వయం చేసుకోవడానికి మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకులతో రేవంత్ రెడ్డి, మల్లుభట్టి విక్రమార్క సమావేశమయ్యారు. పాదయాత్రను సమన్వయం చేసుకోవడంలో ఒక ప్రాథమిక అంచనాకు వచ్చినట్టుగా రేవంత్ రెడ్డి  చెప్పారు. మహారాష్ట్ర, తెలంగాణ నేతలతో ఒక సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ, మహారాష్ట్రలో కామన్ సమస్యలు ఉన్నాయని అన్నారు. వాటిని ఎలా ఎక్స్పోజ్ చేయాలనే అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చలు జరిపినట్టుగా చెప్పారు. 
 

click me!