విషాదం: టెక్కీ శ్రీకాంత్ అనుమానాస్పద మృతి

Published : Oct 10, 2021, 02:39 PM IST
విషాదం: టెక్కీ శ్రీకాంత్ అనుమానాస్పద మృతి

సారాంశం

సికింద్రాబాద్ మౌలాలి హెచ్‌బీ కాలనీకి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శ్రీకాంత్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. పెళ్లైన మూడు నెలలకే భార్య అతడిని వదిలి వెళ్లింది. ఆ తర్వాత ఆయన మద్యానికి బానిసగా మారాడు.

హైదరాబాద్: secundrabad మౌలాలి హెచ్‌బీ కాలనీకి చెందిన techie  srikanth అనుమానాస్పద స్థితిలో మరణించాడు. బెంగుళూరులోని కాగ్నిజెంట్ లో శ్రీకాంత్  టెక్కీగా పనిచేస్తున్నాడు.2007లో శ్రీకాంత్ కి పెళ్లైంది. అయితే పెళ్లైన మూడు మాసాల తర్వాత అతనికి డయాబెటిస్ ఉన్న విషయం తెలుసుకొన్న భార్య  అతడిని వదిలి వెళ్లిపోయింది. దీంతో శ్రీకాంత్  loiquorకి బానిసగా మారాడు. 

also read:కొత్తపల్లి ప్రమాదంపై కేసీఆర్ దిగ్భ్రాంతి... మృతులు ఒక్కొక్కరికి రూ.5లక్షల ఆర్థికసాయం

ఈ నెల 7వ తేదీన శ్రీకాంత్ hyderabad వచ్చాడు. డైమండ్ పాయింట్ చౌరస్తాలోని  guest house లో శ్రీకాంత్ ఉంటున్నాడు. ప్రతి రోజూ శ్రీకాంత్ కు ఆయన బంధువు  srinivas భోజనం తెస్తున్నాడు. శనివారం నాడు కూడ శ్రీనివాస్ భోజనం తెచ్చాడు. అయితే శ్రీకాంత్ మాత్రం తలుపులు తెరవలేదు.

గెస్ట్ హౌస్ సిబ్బందితో కలిసి తలుపులను తెరిచి చూస్తే శ్రీకాంత్ అపస్మారకస్థితిలో ఉన్నాడు. శ్రీనివాస్ వెంటనే 108 అంబులెన్స్ కు సమాచారం ఇచ్చాడు. అంబులెన్స్ సిబ్బంది శ్రీకాంత్ ను పరీక్షించగా ఆయన అప్పటికే మరణించినట్టుగా సిబ్బంది ధృవీకరించారు.
 

PREV
click me!

Recommended Stories

Harish Rao on Revanth Reddy in Assembly:మూసీ కంటే ముఖ్యమంత్రి మాటల కంపు ఎక్కువ | Asianet News Telugu
CM Revanth Reddy Comments: ఆ వాటర్ ప్రాజెక్ట్ పై శాశ్వత సంతకం కేసీఆర్ చేశారు | Asianet News Telugu