Huzurabad Bypoll: ఇస్త్రీపెట్టె చేతబట్టి, ఇంటింటికి తిరుగుతూ... మంత్రి గంగుల ప్రచార జోరు

Arun Kumar P   | Asianet News
Published : Oct 10, 2021, 01:26 PM ISTUpdated : Oct 10, 2021, 01:47 PM IST
Huzurabad Bypoll: ఇస్త్రీపెట్టె చేతబట్టి, ఇంటింటికి తిరుగుతూ... మంత్రి గంగుల ప్రచార జోరు

సారాంశం

హుజురాబాద్ ఉపఎన్నికలో నామినేషన్ల పర్వం ముగియడంతో ప్రధాన పార్టీలన్ని ప్రచార జోరు పెంచాయి. మంత్రి గంగుల కమలాకర్ ప్రజలతో మమేకమవుతూ ప్రచారాన్ని సాగించారు. 

కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నికలో నామినేషన్ ప్రక్రియ పూర్తవడంతో అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రచార జోరు పెంచింది. ఇవాళ(ఆదివారం) సెలవురోజు కావడంతో హుజురాబాద్ పట్టణంలో ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తూ ప్రజలతో మమేకమయ్యారు మంత్రి గంగుల కమలాకర్. పట్టణంలోని 25వ వార్డులోని సూపర్ బజార్ లో మంత్రి గంగుల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఓ లాండ్రీ వద్దకు వెళ్లిన మంత్రి  బట్టలు ఇస్త్రీ చేస్తూ ఓటర్లతో ముచ్చటించారు. 

ఈ సందర్భంగా మంత్రి gangula kamalakar మాట్లాడుతూ... రజకులు, నాయీ బ్రాహ్మణులకు 250 యూనిట్ల ఉచిత కరెంటు ఇచ్చి వారికి చేదోడు-వాదోడుగా నిలిచిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్నారు. Telangana CM KCR చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఈ ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిలబెట్టిన టీఆర్ఎస్ అభ్యర్థి Gellu Srinivas Yadav ను భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి గంగుల కోరారు. 

వీడియో

ఇటీవలే(అక్టోబర్ 8వ తేదీన) హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసింది.  bjp అభ్యర్ధిగా మాజీ మంత్రి etela rajender,టీఆర్ఎస్ అభ్యర్ధిగా gellu srinivas yadav కాంగ్రెస్ అభ్యర్ధిగా balmuri venkat నామినేషన్లు దాఖలు చేశారు. విధుల నుండి తొలగించడంతో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, ఉద్యోగాలు భర్తి చేయనందుకు నిరుద్యోగులు ప్రభుత్వ తీరును నిరసిస్తూ నామినేషన్లు దాఖలు చేశారు.  దీంతో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి.

read more  Huzurabad Bypoll: బిగ్ షాక్... టీఆర్ఎస్ లో చేరిన ఈటల బంధువులు, కులస్తులు

హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి అక్టోబర్ 1వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు అధికారులు. ఇదేరోజు నుండి నామినేషన్ స్వీకరణ ప్రక్రియ కూడా ప్రారంభమయ్యింది. ఈ నెల 8వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించారు. అక్టోబర్ 11వ తేదీన నామినేషన్ల పరిశీలన, అక్టోబర్ 13న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా నిర్ణయించారు. అక్టోబర్ 30న పోలింగ్ నిర్వహించనున్నారు. నవంబర్ 2 న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నట్టుగా ఈసీ తెలిపింది.

అసైన్డ్ ,దేవాలయ భూములను ఆక్రమించుకొన్నారనే ఆరోపణలతో ఈటల రాజేందర్ ను కేసీఆర్ తన మంత్రివర్గం నుండి తొలగించారు. దీంతో ఈ ఏడాది జూన్ 12న రాజేందర్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.  అదే నెల 14న రాజేందర్ బీజేపీలో చేరారు. దీంతో హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.  

తమ పార్టీని వీడి బిజెపిలో చేరిన ఈటలను ఏలాగయినా ఓడించాలని టీఆర్ఎస్ అధినాయకత్వం భావిస్తోంది. దీంతో ఆ పార్టీ ట్రబుల్ షూటర్ హరీష్ రావు, జిల్లా మంత్రి గంగుల కమలాకర్ తో పాటు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు సైతం ప్రచారంలోకి దిగారు. అయితే బిజెపి కూడా దుబ్బాక, జిహెచ్ఎంసీ ఎన్నికల విజయాన్ని హుజురాబాద్ లోనూ పునరావృతం చేయాలని చూస్తోంది. ఈటలను ఎట్టి పరిస్థితుల్లో గెలిపించి సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీకి షాకివ్వాలని చూస్తోంది.


 

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు