తెలంగాణకు దేశ విదేశాల కంపనీలు.. పెట్టుబడులకు కేంద్రస్థానమిదే: ఎమ్మెల్సీ కవిత

By Arun Kumar PFirst Published Oct 10, 2021, 2:08 PM IST
Highlights

తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి దేశ విదేశాలకు చెందిన వ్యాపారవేత్తలు ఆసక్తి చూపిస్తున్నట్లు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. 

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులు పెట్టేందుకు దేశ విదేశాల నుండి అనేక కంపెనీలు ముందుకురావడం సంతోషంగా ఉందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం టీఎస్‌ఐపాస్‌, సింగిల్‌ విండో అనుమతులు లాంటి అనేక చర్యలు చేపట్టిందని... అందువల్లే రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెడుతోందని kalvakunta kavitha  పేర్కొన్నారు. 

హైదరాబాద్ లోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో క్రిస్సమ్ ఫర్నీచర్, ఇంటీరియర్ షోరూంను ఎమ్మెల్సీ కవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూం నిర్వాహకులకు కవిత శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా ప్రారంభించిన ఫర్నిచర్ షోరూంలో ఉద్యోగాలన్ని స్థానిక యువతకే ఇస్తానని తెలిపిన నిర్వాహకుడు కిరణ్ ను  కవిత అభినందించారు.

read more  తైవాన్ పెట్టుబడులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తాం.. ఇన్వెస్ట్ ఇండియా సమావేశంలో మంత్రి కేటీఆర్

ఇదిలావుంటే తెలంగాణలో ఇప్పటికే 32 బిలియన్ డాలర్ పెట్టుబడులను ఆకర్షించిందని... ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలంగాణ ఎప్పుడూ అగ్రస్థానంలో నిలుస్తున్నదని మంత్రి కేటీఆర్ వెల్లడించిన విషయం తెలిసిందే. తమ రాష్ట్రం ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, పరిశోధన అభివృద్ధి రంగాల్లో మరిన్ని పెట్టుబడులను ఆశిస్తున్నదన్నారు KTR. ఇందుకోస దేశ విదేశాల్లోని దిగ్గజ కంపనీలను తెలంగాణలో  పెట్టుబడులు పెట్టడానికి ఆహ్వానిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. 

ఇన్వెస్ట్ ఇండియా సీఈవో దీపక్ బగ్లా కూడా తెలంగాణ రాష్ట్ర పాలసీలు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. తైవాన్‌కు తెలంగాణ సహజ భాగస్వామి అని తైవాన్ ఎక్స్‌టర్నల్ ట్రేడ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ చైర్మన్ జేమ్స్ ఎఫ్ హువాంగ్ అన్నారు. న్వెస్ట్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన తైవాన్ కనెక్ట్ తెలంగాణ స్టేట్ సమవేశానికి హాజరైన మంత్రి కేటీఆర్ తో పాటు మిగతావారు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామికాభివృద్దిని కొనియాడారు. 

click me!