హైద్రాబాద్ బీహెచ్ఈఎల్‌లో టెక్కీ సూసైడ్: పిల్లలతో కలిసి చంద్రకాంత్ భార్య ఆత్మహత్య

By narsimha lodeFirst Published Dec 3, 2021, 11:31 AM IST
Highlights

హైద్రాబాద్ కు సమీపంలోని బీహెచ్ఈఎల్ లో ఆర్ధిక ఇబ్బందులతో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఆర్ధిక ఇబ్బందుల కారణంగా టెక్కీ చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకొన్నాడు.  ఈ విషయం తెలుసుకొన్న భార్య పిల్లలతో కలిసి సూసైడ్ చేసుకొంది.

హైదరాబాద్: హైద్రాబాద్ కు సమీపంలోని బీహెచ్ఈఎల్  లో ఆర్ధిక ఇబ్బందులతో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. భర్త ఆత్మహత్య చేసుకొన్న విషయం తెలుసుకొన్న భార్య తన పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది.బీహెచ్ఈఎల్ తెల్లాపూర్ విద్యుత్ నగర్ లో చంద్రకాత్  అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకొన్నాడు.  భర్త ఆత్మహత్య చేసుకొన్న విషయం  తెలుసుకొన్న భార్య లావణ్య  పిల్లలతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకొంది. చంద్రకాంత్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా  పనిచేస్తున్నారు.  చంద్రకాంత్ ఇటీవల కాలంలో అప్పులు చేశాడు. అప్పుల విషయమై భార్యాభర్తల మధ్య ఇటీవల కాలంలో గొడవలు జరుగుతున్నాయి. అయితే గురువారం నాడు భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. ఈ గొడవ జరిగిన తర్వాత పిల్లలను తీసుకొని లావణ్య ఇంటి నుండి బయటకు వెళ్లిపోయింది. దీంతో వెంటనే చంద్రకాంత్ తన ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు.  ఈ విషయం తెలుసుకొన్న లావణ్య  కూడా ఆత్మహత్య చేసుకొంది. 

also read:లవర్ మాట్లాడడం లేదని యువకుడి ఆత్మహత్యాయత్నం: ఆసుపత్రికి తరలింపు

Chandra kanth టీసీఎస్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. విద్యుత్ నగర్ కు సమీపంలోని వాంబే కాలనీలో చంద్రకాంత్ ఇంటి నిర్మాణం చేపట్టారు.  దీని కోసం చంద్రకాంత్ భార్య Lavnya పేరేంట్స్ రూ. 40 లక్షలు ఇచ్చారు. చంద్రకాంత్ కు వచ్చే జీతం కూడా ఇంటి నిర్మాణానికే సరిపోతోంది. దీంతో చంద్రకాంత్ తన తల్లిదండ్రులను ఇంటి నిర్మాణం కోసం డబ్బులు అడిగాడు. అయితే డబ్బులు ఇచ్చేందుకు తల్లిదండ్రులు నిరాకరించారు. ఈ విషయమై ఇంట్లో గొడవ జరిగింది.  ఈ గొడవతో లావణ్య తన పిల్లలను తీసుకొని ఇంటి నుండి వెళ్లిపోయింది. దీంతో మనోవేదనకు గురైన చంద్రకాంత్ Suicide చేసుకొన్నాడు. అయితే ఇంటి నుండి వెళ్లి పోయిన లావణ్య కొద్ది సేపటికి పక్కింటి వాళ్లకి ఫోన్ చేసింది. అయితే అప్పటికే చంద్రకాంత్ మరణించాడు.ఇదే విషయాన్ని పొరుగింటి వాళ్లు లావణ్యకు సమాచారం ఇచ్చారు. దీంతో  లావణ్య ఆంధోల్ చెరువులో ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకొంది. లావణ్యది కామారెడ్డి జిల్లా. టెక్కీ చంద్రకాంత్ ది జహీరాబాద్ జిల్లాగా పోలీసులు చెబుతున్నారు.

 

click me!