కీచక డాక్టర్.. ట్రైనింగ్ నర్సుపై సూపరింటెండెంట్‌ అసభ్య ప్రవర్తన, దేహశుద్ధి..

By SumaBala BukkaFirst Published Dec 3, 2021, 11:24 AM IST
Highlights

శిక్షణలో ఉన్న నర్సింగ్ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ కోరిక తీర్చాలని వేధిస్తున్న డాక్టర్ కు ఆమె బంధువులు ఊహించని షాక్ ఇచ్చారు. ఆస్పత్రికి భారీగా చేరుకుని డాక్టర్ రోడ్డు మీదకి లాగి దేహశుద్ధి చేశారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో జరిగింది. ఈ సంఘటనను సీరియస్ గా తీసుకున్న తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్.. ఆసుపత్రి సూపరింటెండెంట్ నర్సింగ్‌ చౌహాన్‌ ను సస్పెండ్ చేస్తూ గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.

నారాయణ ఖేడ్ : ట్రైనింగ్‌ నర్సుతో అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపణలు ఎదుర్కొంటోన్న సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ నర్సింగ్ చౌహన్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. అతనిని తాత్కాలికంగా విధుల నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

కాగా, Narayana Khed ఏరియా ఆస్పత్రిలో సూపరింటెండెంట్‌ విధులు నిర్వహిస్తోన్న నర్సింగ్‌ చౌహాన్‌ తనను వేధించాడంటూ సునీత అనే Training‌ Nurse పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన ఛాంబర్ కు తీసుకెళ్లి వ్యక్తిగత విషయాలు అడిగాడని.. బావ వరుస అవుతానని చెంపలపై చేతులు వేసి Obsceneగా ప్రవర్తించాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.

తెలుగు అకాడమీ స్కాం : ఎఫ్‌డీల కుంభకోణంలో మరొకరికి బేడీలు.. ఆమె ఎవరంటే...

వివరాల్లోకి వెడితే.. శిక్షణలో ఉన్న నర్సింగ్ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ కోరిక తీర్చాలని వేధిస్తున్న డాక్టర్ కు ఆమె బంధువులు ఊహించని షాక్ ఇచ్చారు. ఆస్పత్రికి భారీగా చేరుకుని డాక్టర్ రోడ్డు మీదకి లాగి దేహశుద్ధి చేశారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో జరిగింది. ఈ సంఘటనను సీరియస్ గా తీసుకున్న తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్.. ఆసుపత్రి సూపరింటెండెంట్ Dr. Nursing Chauhan ను సస్పెండ్ చేస్తూ గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.

కల్హేర్ మండలం గిరిజన తండాకు చెందిన యువతి (24) నారాయణఖేడ్ ప్రాంతీయ ఆస్పత్రిలో నర్సింగ్ ట్రైనింగ్ పొందుతోంది. బుధవారం ఆమె విధులు ముగించుకుని వెళుతుండగా Superintendent చౌహాన్ తన గదిలోకి పిలిచాడు. తొందరగా ఎందుకు వెళ్తున్నావ్.. అని ప్రశ్నించగా.. బస్సు టైం అవుతుంది అని చెప్పింది. ‘ఆలస్యంగా వెళ్దువు గానీలే కాసేపు నాతో మాట్లాడు..’ అంటూ ఆమె వ్యక్తిగత విషయాలు అడగడం మొదలు పెట్టాడు. 

సింగరేణిలో సమ్మె సైరన్: కార్మిక సంఘాలతో నేడు అధికారుల చర్చలు

క్రమంగా ఆమె శరీరంపై చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో షాకైన యువతి అతడి బారినుంచి తప్పించుకొని వెళ్లి family membersకు విషయం చెప్పింది. ఈ నేపథ్యంలోనే గురువారం యువతి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు నారాయణఖేడ్ చేరుకున్నారు. యువతితో  నర్సింగ్ చౌహాన్కు ఫోన్ చేయించి ఓ  ఓషాపింగ్ మాల్ వద్దకు రప్పించారు. అక్కడ వాగ్వాదం చోటుచేసుకోవడంతో అతడిని ఆస్పత్రి ఆవరణలోకి తీసుకు వచ్చి అందరి ముందు దేహశుద్ధి చేశారు.

దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితి సద్దుమణిగేలా చేశారు. ఆ తర్వాత బాధితురాలి ఫిర్యాదు మేరకు సూపరింటెండెంట్‌పై, ఆయన ఫిర్యాదు మేరకు బాధితురాలితో పాటు ఆమె కుటుంబీకులు, బంధువులపై కేసులు నమోదు చేసినట్లు నారాయణఖేడ్ ఎస్ఐ వెంకటరెడ్డి చెప్పారు.

ఈ ఘటనకు సంబంధించి నార్సింగ్ చౌహాన్ ను సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు.. శుక్రవారం నారాయణఖేడ్ ప్రాంతీయ ఆసుపత్రిని సందర్శించి సమగ్ర విచారణ జరిపి నివేదిక అందించాలని జిల్లా ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ సంగారెడ్డి ని ఆదేశించారు. 

click me!