సింగరేణిలో సమ్మె సైరన్: కార్మిక సంఘాలతో నేడు అధికారుల చర్చలు

By narsimha lodeFirst Published Dec 3, 2021, 11:22 AM IST
Highlights


బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ సింగరేణి కార్మిక సంఘాలు సమ్మె నోటీసు ఇచ్చాయి. ఈ నెల 9వ తేదీ నుండి కార్మిక సంఘాలు సమ్మెకు దిగనున్నాయి. అయితే  కార్మిక సంఘాలతో  సింగరేణి అధికారులు ఇవాళ చర్చలు జరపనున్నారు.


హైదరాబాద్: బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ  సింగరేణిలో కార్మిక సంఘాలు సమ్మె బాట పట్టనున్నాయి. ఈ మేరకు కార్మిక సంఘాలు Strike  notice ను ఇచ్చాయి. ఈ నెల 9వ తేదీ నుండి 72  గంటల పాటు సమ్మెను నిర్వహించనున్నాయి. కార్మిక సంఘాల నేతలు సమ్మె నోటీసులు ఇవ్వడంతో  కార్మిక సంఘాలతో సింగరేణి అధికారులు శుక్రవారం నాడు  చర్చించనున్నారు.ప్రభుత్వ రంగ సంస్థలైన  Coal india, సింగరేణిలు స్వంత వనరులతోనే లాభాల బాటలో సాగుతున్నాయి. పన్నుల రూపంలో అయిదేళ్లలో సింగరేణి రాష్ట్రానికి రూ. 15,011 కోట్లు, కేంద్రానికి రూ. 17,690 కోట్లు కేంద్రానికి చెల్లించింది.

singareni సంస్థ తనకు చెందిన నాలుగు coal బ్లాకుల్లో నిక్షేపాలను వెలికి తీసేందుకు భూసేకరణ కోసం రూ. 750 కోట్లను కేటాయించింది. వీటికి వేలం నిర్వహిస్తే ఉత్పత్తి విలువలో 4 శాతం చెల్లించి పాల్గొనాల్సి ఉంటుంది. వేలంలో ప్రైవేట్ సంస్థలు ఎక్కువ కోట్ చేసి బ్లాకులను దక్కించుకొంటే ప్రభుత్వ రంగ సంస్థలు వెనుకబడిపోతాయని కార్మిక సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.ఇవాళ సింగరేణి యాజమాన్యంతో చర్చించిన మీదట  కార్మిక సంఘాలు  తమ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నాయి. సింగరేణి యాజమాన్యంతో చర్చలు సంతృప్తిగా ముగిస్తే కార్మిక సంఘాలు సమ్మె విషయమై పునరాలోచన చేసే అవకాశం ఉందా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

click me!