నందమూరి సుహాసిని తీరునచ్చక.. సీనియర్ నేత రాజీనామా

By ramya neerukondaFirst Published Nov 23, 2018, 2:40 PM IST
Highlights

టీడీపీ మహిళా నేత నందమూరి సుహాసిని తీరు నచ్చక.. ఓ సీనియర్ నేత పార్టీకీ రాజీనామా చేశారు. 

టీడీపీ మహిళా నేత నందమూరి సుహాసిని తీరు నచ్చక.. ఓ సీనియర్ నేత పార్టీకీ రాజీనామా చేశారు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో.. సుహాసిని రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. మహాకూటమిలో భాగంగా టీడీపీ తరపు నుంచి ఆమెకు కూకట్ పల్లి టికెట్ కేటాయించారు.

అయితే.. ఎన్నికల ప్రచారంలో ఆమె వ్యహారతీరు నచ్చలేదని సీనియర్ నేత మాధవరం రంగారావు పార్టీకీ రాజీనామా చేశారు. తనను సుహాసినీ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంచారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో.. ఆయన కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు.

నియోజకవర్గ ఫైవ్‌మెన్‌ కమిటీలో రంగారావు కీలక పాత్ర పోషించారు. అటు కూకట్‌పల్లి నియోజకవర్గంలోని కూకట్‌పల్లి డివిజన్‌.. ఇటు శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని వివేకానందనగర్‌కాలనీ డివిజన్లకు ఆయన ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. సడెన్ గా ఆయన పార్టీ మారడంతో పార్టీ నేతలు షాకయ్యారు.

గతంలో రంగారావు టీడీపీ నుంచి వివేకానందనగర్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ గా పనిచేశారు. టీఆర్ఎస్ నేత అరికపూడి గాంధీ దగ్గరుండి రంగారావుని టీఆర్ఎస్ లో చేర్పించినట్లు సమాచారం. 

read more news

పార్టీ పరంగా..: సుహాసిని పోటీపై పురంధేశ్వరి వ్యాఖ్యలు

సుహాసిని... తండ్రి పేరు.. భర్త పేరు అయ్యింది.

సుహాసినీ కోసం.. రంగంలోకి ఎన్టీఆర్

కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థి సుహాసిని ఆస్తులివే

కూకట్ పల్లి టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన సుహాసిని

సుహాసినికి జూనియర్ ఎన్టీఆర్ ప్రచారంపై స్పందించిన బాలయ్య

ఎన్టీఆర్‌‌కు నివాళులర్పించిన నందమూరి సుహాసిని

బరిలోకి సుహాసిని: తెర వెనక భువనేశ్వరి

మాధవరం తెలుగుదేశం ద్రోహి, అతన్ని ఓడిస్తా.. సుహాసిని నా బిడ్డ: పెద్దిరెడ్డి

అందుకే రాజకీయాల్లోకి వచ్చా, తండ్రిని తల్చుకొని కన్నీళ్లు పెట్టుకొన్న సుహాసిని

హరికృష్ణ సానుభూతి, ఎన్టీఆర్ ఛరిష్మా: టీడీపీ తురుపుముక్క సుహాసిని

నందమూరి సుహాసినీపై.. మిత్రపక్షం కాంగ్రెస్ తిరుగుబాటు

కూకట్‌పల్లి సుహాసినికి కేటాయింపు: బాబు వద్దకు పెద్దిరెడ్డి

click me!