కేసీఆర్ కి ఓటమి భయం పట్టుకుంది.. కోమటిరెడ్డి

Published : Nov 23, 2018, 01:27 PM IST
కేసీఆర్ కి ఓటమి భయం పట్టుకుంది.. కోమటిరెడ్డి

సారాంశం

ఈ ఎన్నికల తర్వాత కేసీఆర్.. ఫామ్ హౌస్ కే అంకితమౌతారని జోస్యం చెప్పారు. నాలుగున్నరేళ్లు.. కేసీఆర్.. ప్రజలకు నరకం చూపించారని ఆరోపించారు.

తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి ఓటమి భయం పట్టుకుందని కాంగ్రెస్ పార్టీ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. శుక్రవారం నల్గొండ పట్టణంలోని ఛాయా సోమేశ్వర ఆలయంలో ఎన్నికల్లో గెలుపు సాధించాలని కోరుకుంటూ.. ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం పట్టణంలో ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల తర్వాత కేసీఆర్.. ఫామ్ హౌస్ కే అంకితమౌతారని జోస్యం చెప్పారు. నాలుగున్నరేళ్లు.. కేసీఆర్.. ప్రజలకు నరకం చూపించారని ఆరోపించారు.

ఇప్పటికే కేసీఆర్ కి ఎన్నికల భయం పట్టుకుందన్నారు. ఇప్పటి వరకు గారడి మాటలతో కేసీఆర్ పాలన సాగించారని, ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ఈ ఎన్నికల ఫలితాలు కేసీఆర్ కి బుద్ధి చెబుతాయన్నారు. 

PREV
click me!

Recommended Stories

Richest District : ఇండియాలో రిచెస్ట్ జిల్లా ఏదో తెలుసా? ముంబై, ఢిల్లీ కానే కాదు !
IMD Rain Alert : సంక్రాంతి పండగపూట తెలంగాణలో వర్షాలు.. హైదరాబాద్ సహా ఈ జిల్లాల్లో జల్లులు