ప్రణయ్ భార్య అమృతకు టీడీపి బంపర్ ఆఫర్

By pratap reddyFirst Published 19, Sep 2018, 9:36 PM IST
Highlights

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అమృత కుటుంబాన్ని రమణ పరామర్శించారు. ప్రణయ్ తల్లికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు.

నల్గొండ: మామ చేతిలో హత్యకు గురైన ప్రణయ్ భార్య అమృత వర్షిణికి తెలుగుదేశం పార్టీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. తమ మహాకూటమి అధికారంలోకి వస్తే అమృతకు కోటి రూపాయల ఆర్థికసాయం అందిస్తామని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ప్రకటించారు. 

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అమృత కుటుంబాన్ని రమణ పరామర్శించారు. ప్రణయ్ తల్లికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అమృత కుటుంబాన్ని పరామర్శించకపోవడం విచారకరమని ఆయన అన్నారు. 

తండ్రి మారుతీరావు ఆస్తుల్లో సగం అమృత కుటుంబానికి అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కోటి రూపాయల నష్టపరిహారం ప్రకటించాలని కోరారు. అమృత ఆరోపించిన ప్రతివ్యక్తిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

మిర్యాలగూడ అసెంబ్లీ సీటుకు ప్రణయ్ భార్య అమృత పోటీ

ప్రణయ్ ఫ్యామిలీకి పరామర్శ: మాజీ ఎంపీ వివేక్ కన్నీటి పర్యంతం

ప్రణయ్‌ను హత్య చేసింది బీహార్ వాసి శర్మ, ఫ్లైట్లో హైదరాబాదుకు తరలింపు

ప్రణయ్ హత్య: మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని కూడ విచారిస్తాం: ఎస్పీ

ప్రణయ్ హత్యపై చంద్రబాబు స్పందన ఇదీ..

Last Updated 19, Sep 2018, 9:43 PM IST