తండ్రి చేతిలో దాడికి గురైన మాధవి... డాక్టర్లు ఏమంటున్నారంటే....

First Published 19, Sep 2018, 9:09 PM IST
Highlights

తనకు ఇష్టం లేకుండా కూతురు కులాంతర వివాహం చేసుకుందని ఓ తండ్రి అత్యంత దారుణానికి పాల్పడ్డాడు. కన్నకూతురితో పాటు ఆమె ప్రేమించిన వ్యక్తిని పట్టపగలే నడి రోడ్డుపై వేట కొడవలితో నరికాడు. అందరూ చూస్తుండగానే ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ దాడిలో ప్రేమజంట తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 

తండ్రి మనోహరాచారి చేతిలో తీవ్రంగా గాయపడిన మాధవితో పాటు సందీప్ లు ప్రస్తుతం సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరితో సందీప్ ఆరోగ్య పరిస్థితి బాగానే వున్నా మాధవి మాత్రం తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఈ దాడిలో మెదడుకు రక్తం సరఫరా చేసే రక్తనాళం తెగిపోయినట్లు తెలిపారు. అంతే కాతు ఆమె చేయికి కూడా తీవ్ర గాయమై స్కిన్ వేలాడుతోందని తెలిపారు. రక్తంలో హిమోగ్లోబిన్ శాతం కూడా పడిపోయినట్లు  వెల్లడించారు. మరికొంత సమయం గడిస్తే కానీ ఆమె ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు చెప్పలేమని డాక్టర్లు తెలిపారు. 

నవదంపతులపై దాడికి పాల్పడిన మనోహరరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడితో పాటు అతడి భార్యను కూడా విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 
 
సంబంధిత వార్తలు

నవదంపతులపై దాడి చేసిన మనోహరచారి అరెస్ట్

నిన్న అమృత, నేడు మాధవి: తండ్రులకు ఎందుకీ అసహనం?

ఎస్ఆర్ నగర్ దాడి: నమ్మించి నవదంపతులను నరికిన అమ్మాయి తండ్రి

Last Updated 19, Sep 2018, 9:13 PM IST