నవదంపతులపై దాడి చేసిన మనోహరచారి అరెస్ట్

Published : Sep 19, 2018, 08:36 PM ISTUpdated : Sep 19, 2018, 09:08 PM IST
నవదంపతులపై దాడి చేసిన మనోహరచారి అరెస్ట్

సారాంశం

ఎస్ఆర్ నగర్ బండ్ల గూడ వద్ద నవదంపతులపై కొడవలితో దాడికి పాల్పడ్డ మనోహరాచారిని పోలీసులు అరెస్ట్ చేశారు. తన కుమార్తె మాధవి తనకు ఇష్టం లేని యువకుడిని వివాహం చేసుకుందని ఆగ్రహంతో రగిలిపోతున్న మనోహరచారి బుధవారం బండ్లగూడ వద్ద నవ దంపతులపై కొడవలితో దాడి చేశాడు. 

హైదరాబాద్: ఎస్ఆర్ నగర్ బండ్ల గూడ వద్ద నవదంపతులపై కొడవలితో దాడికి పాల్పడ్డ మనోహరాచారిని పోలీసులు అరెస్ట్ చేశారు. తన కుమార్తె మాధవి తనకు ఇష్టం లేని యువకుడిని వివాహం చేసుకుందని ఆగ్రహంతో రగిలిపోతున్న మనోహరచారి బుధవారం బండ్లగూడ వద్ద నవ దంపతులపై కొడవలితో దాడి చేశాడు. 

ఈ దాడిలో కుమార్తె మాధవి పరిస్థితి విషమంగా ఉంది. సందీప్ ప్రస్తుతం కోలుకుంటున్నట్లు సమాచారం. కులాంతర వివాహం చేసుకోవడమే హత్యకు ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు.

అయితే నవదంపతులపై దాడి చేసిన మనోహరచారి అక్కడ నుంచి పరారయ్యాడు. ఎంఎస్ మక్తాలోని తన బావమరిది నివాసంలో దాక్కుని ఉండగా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు నుంచి హత్యకు ఉపయోగించిన కొడవలని స్వాధీనం చేసుకున్నారు. మనోహరాచారిని విచారణ నిమిత్తం ఎస్ఆర్ నగర్ పీఎస్ కు తరలించారు. 

మాధవి, సందీప్ లపై దాడికి సంబంధించిన ఘటనపై వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ స్పందించారు. నవ దంపతులపై దాడి చేసిన ఘటనలో మనోహరాచారి మద్యం సేవించి ఉన్నట్లు తెలిపారు. హత్య వెనుక కులపరమైన అంశం ఏమీ లేదన్నారు. తనకు ఇష్టం లేకుండా ప్రేమ వివాహం చేసుకోవడంతో ఆగ్రహంతో ఉన్న మనోహరాచారి కుమార్తె మాధవిని హత్య చెయ్యాలని ప్లాన్ వేసినట్లు తెలిపారు. సందీప్ ను చంపాలన్నది నిందితుడు మనోహరాచారి ఉద్దేశం కాదన్నారు.

ప్రస్తుతం మాధవి పరిస్థితి విషమంగానే ఉందని అయితే సందీప్ పరిస్థితి పర్వాలేదని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. సెప్టెంబర్ 12న మాధవి, సందీప్ లు వివాహం చేసుకున్నారని తమకు రక్షణ కల్పించాలని ఎస్ఆర్ నగర్ పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపారు. తాము వారి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ సైతం ఇచ్చినట్లు తెలిపారు.  నిందితుడిపై హత్యాయత్నంతోపాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. 

 

సంబంధిత వార్తలు

తండ్రి దాడి: మాధవి పరిస్థితిపై ఇప్పుడే చెప్పలేమంటున్న డాక్టర్లు

ఎస్ఆర్ నగర్ దాడి: లొంగిపోయిన మనోహరాచారి, మాధవి పరిస్థితి విషమం

ఎస్ఆర్ నగర్ దాడి: నమ్మించి నవదంపతులను నరికిన అమ్మాయి తండ్రి

టెన్త్ క్లాస్‌ నుండే ప్రేమ: కులాంతర వివాహం నచ్చకే తండ్రి దాడి

నవదంపతులపై దాడి: బట్టలు పెడతామని పిలిచి ఘాతుకం (వీడియో)

ప్రణయ్ హత్య మరవకముందే.. నగరంలో మరో సంఘటన

 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్