మేము టిడిపి వీడే ప్రశ్నే లేదు

Published : Dec 22, 2017, 04:28 PM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
మేము టిడిపి వీడే ప్రశ్నే లేదు

సారాంశం

సైకిల్ దిగుతామన్న ప్రచారంలో నిజం లేదు మేము టిడిపిలోనే ఉంటాం మాపై ప్రచారం  విశ్వసనీయత దెబ్బతీసే ప్రయత్నమే

తెలంగాణలో సీనియర్ నేత, టిడిపి రాజ్యసభ సభ్యుడు దేవేందర్ గౌడ్, ఆయన తనయుడు తెలుగు యువత అధ్యక్షుడు వీరేందర్ గౌడ్ పార్టీ మారతారన్న వార్తలపై వివరణ ఇచ్చారు. వీరేందర్ గౌడ్ ఈమేరకు ఒక పత్రికా ప్రకటన జారీ చేశారు.

తన తండ్రి, తాను సైకిల్ దిగి వేరే పార్టీలో చేరతామంటూ సోషల్ మీడియాలో వచ్చిన వార్తల్లో నిజం లేదన్నారు. తన తండ్రి దేవేందర్ గౌడ్ మొదటి నుంచీ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తపించిపోయేవారని అన్నారు.

తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేందుకు తన తండ్రి మార్గంలో నేనూ నడుస్తున్నానని తెలిపారు. మీడియాలో తాము పార్టీ మారతామంటూ వస్తున్న వార్తలు తమ విశ్వసతనీయతను దెబ్బతీసే ప్రయత్నమేని తెలిపారు.

ఈ వార్తల వల్ల కార్యకర్తల్లో గందరగోళం నెలకొనే ప్రమాదముందన్నారు. ఇలాంటి వార్తలు రాసేముందు తమ వివరణ తీసుకుని ఉంటే మంచిదని సలహా ఇచ్చారు. వీరేందర్ గౌడ్ మీడియాకు పంపిన ప్రెస్ నోట్ కింద ఉంది చూడండి.

PREV
click me!

Recommended Stories

AP & Telangana Rain Alert : ఏపీ, తెలంగాణలో పిడుగులు, ఈదురుగాలులతో వానలే వానలు. | Asianet News Telugu
Weather Update: బంగాళాఖాతంలో ద్రోణి.. ఈ ప్రాంతాల్లో 3 రోజులు పిడుగులతో కూడిన భారీ వర్షాలు