వైఎస్ఆర్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు: బాబుతో భేటీ తర్వాత షర్మిల

By narsimha lode  |  First Published Jan 13, 2024, 11:56 AM IST

చంద్రబాబుకే కాదు, కేటీఆర్, కవిత,  హరీష్ రావులకు కూడ క్రిస్‌మస్ గిఫ్ట్‌లు పంపినట్టుగా వై.ఎస్. షర్మిల తెలిపారు.


హైదరాబాద్:చంద్రబాబుతో భేటీలో ఎలాంటి రాజకీయ అంశాలు  చర్చకు రాలేదని  వై.ఎస్. షర్మిల స్పష్టం చేశారు.తన కొడుకు  రాజారెడ్డి పెళ్లికి రావాలని  ఆహ్వానించినట్టుగా  వై.ఎస్. షర్మిల  చెప్పారు. తనతో  వై.ఎస్. రాజశేఖర్ రెడ్డితో తనకు ఉన్న అనుబంధాన్ని  చంద్రబాబు పంచుకున్నారని వై.ఎస్. షర్మిల చెప్పారు.  క్రిస్‌మస్  పర్వదినాన్ని పురస్కరించుకొని చంద్రబాబు కుటుంబానికి  కేక్ ను పంపినట్టుగా  ఆమె చెప్పారు. లోకేష్ కూడ  తనకు  గిఫ్ట్ పంపిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.  చంద్రబాబుకే కాదు, కవిత, హరీష్ రావు లాంటి వాళ్లకు కూడ తాను క్రిస్‌మస్ గిఫ్ట్ లు పంపిన విషయాన్ని షర్మిల ఈ సందర్భంగా వివరించారు. తన కొడుకు  పెళ్లిని పురస్కరించుకొని అనేక మంది రాజకీయ పార్టీల నేతలను  ఆహ్వానిస్తున్నట్టుగా  షర్మిల చెప్పారు.  ఈ క్రమంలోనే  చంద్రబాబును కూడ ఆహ్వానించామన్నారు. 

also read:ఒంగోలు ఎంపీ సీటుపై సస్పెన్స్:మాగుంటకు మరోసారి లక్కు దక్కేనా?

Latest Videos

వైఎస్ఆర్ కూడ  తన పిల్లల పెళ్లిళ్లకు  చంద్రబాబును ఆహ్వానించారన్నారు.ఆ సమయంలో చంద్రబాబు కూడ వచ్చి తమను ఆశీర్వదించిన విషయాన్ని షర్మిల ప్రస్తావించారు.రాజకీయాల్లోకి వచ్చిన ప్రారంభ రోజుల్లో వైఎస్ఆర్, తాను  ఎలా ఉండేవాళ్లో చంద్రబాబు తనకు వివరించినట్టుగా  షర్మిల చెప్పారు.రాజారెడ్డి పెళ్లికి వస్తానని  చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు.  

also read:ఎంపీ టిక్కెట్టు జేబులో ఉంది,కానీ..: గుమ్మనూరు జయరాం

కాంగ్రెస్ పార్టీ తనకు ఏ పదవి ఇవ్వాలి, ఏ బాధ్యత ఇవ్వాలనే విషయమై  అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు.  రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అయితే  దేశానికి  మంచి జరుగుతుందని  భావిస్తున్నట్టుగా చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలనేది వైఎస్ఆర్ కోరిక అని ఆమె గుర్తు చేశారు. అందుకే తాను  కాంగ్రెస్ లో చేరిన విషయాన్ని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ పార్టీ ఆదేశాలను తాను పాటిస్తానన్నారు.

also read:ఆసక్తికరం: చంద్రబాబు ఇంటికి వై.ఎస్. షర్మిల

చంద్రబాబును తాను కలవడం  స్నేహపూర్వక వాతావరణంలో చూడాల్సిన అవసరం ఉందని షర్మిల చెప్పారు.  రాజకీయాలు అనేది జీవితాలు కాదు, రాజకీయాలు అనేది మా వృత్తి అని ఆమె  తెలిపారు. రాజకీయాల్లో ఉన్నందున పరస్పరం విమర్శలు చేసుకొనే పరిస్థితులు అనివార్యంగా వస్తాయన్నారు. అలాంటి పరిస్థితులను దాటుకొనేందుకు  పండుగలు, పెళ్లిళ్లకు  ఆహ్వానించడం ద్వారా వ్యక్తిగతంగా సంబంధాలు మెరుగౌతాయన్నారు. ప్రతి విషయాన్ని రాజకీయాలతో ముడి పెట్టొద్దని 
షర్మిల సూచించారు. 

చంద్రబాబుతో రాజకీయంగా ఎలాంటి లావాదేవీలు, ఉండవు, ఉండబోవు , ఉండకూడదని షర్మిల స్పష్టం చేశారు.  పార్టీలు, నేతలు ఉన్నందున  ప్రజల కోసం  పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. 

click me!