నిరుపేద మహిళకు పురుడు పోసిన అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ..

Published : Jan 13, 2024, 11:24 AM IST
నిరుపేద మహిళకు పురుడు పోసిన అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ..

సారాంశం

అచ్చంపేట ప్రభుత్వాసుపత్రిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఓ నిరుపేద మహిళకు పురుడు పోశారు. క్లిష్టమైన ఆపరేషన్ చేసి తల్లీబిడ్డలను కాపాడారు.

అచ్చంపేట : అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మానవత్వాన్ని చాటుకున్నారు. ఎమ్మెల్యే అయినా వృత్తి ధర్మాన్ని వీడలేదు. ఓ నిరుపేద మహిళకు సిజేరియన్ చేసి తల్లిబిడ్డల ప్రాణాలు కాపాడారు. నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం జీలుగుపల్లి గ్రామానికి చెందిన ప్రసన్న  అనే మహిళకు 9 నెలలు నిండినా డెలివరీ అవ్వలేదు. 

దీంతో బంధువులు ఆమెను అచ్చంపేట ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు. అయితే ఆమెను పరీక్షించిన వైద్యులు నాగర్ కర్నూలు జిల్లా ఆస్పత్రికి తీసుకు వెళ్లాలని తెలిపారు. ఏం చేయాలో పాలుపోనీ ఆ కుటుంబ సభ్యులు  శుక్రవారం అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణను కలిశారు. తమ సమస్యను చెప్పి వేడుకున్నారు. వెంటనే స్పందించిన వంశీకృష్ణ వెంటనే హుటాహుటిన అచ్చంపేట ప్రభుత్వాసుపత్రికి వచ్చారు. అక్కడున్న వైద్యులతో కలిసి ఆ మహిళకు సిజేరియన్ చేశారు.  

ఆ మహిళ ఆడబిడ్డకు జన్మనిచ్చింది.  తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. అచ్చంపేట ఎమ్మెల్యేగా ఎన్నికైన వంశీకృష్ణ డాక్టర్. సర్జన్ గా ఆయనకు మంచి పేరుంది. ఎమ్మెల్యే కాకముందు హైదరాబాద్, అచ్చంపేట,  కల్వకుర్తిలలో  ప్రాక్టీస్ కూడా చేశారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?