యోగితాజీ సురానా మాట్లాడుతూ.. తనకు పైలట్, సీఏ, లేదా ఐఏఎస్ కావాలనే కోరిక చిన్నతనం నుంచి ఉందని చెప్పుకొచ్చింది. కానీ వయసు పెరిగిన కొద్దీ తన కోరికలు, అభిరుచుల్లో మార్పులు వచ్చాయని.. కోరికలకు అంతు ఉండదని అర్థం చేసుకున్నట్లుగా తెలిపింది.
హైదరాబాద్ : చిత్తూరుకు చెందిన రాజస్థానీ జైన్ మార్వాడీ స్వర్ణకారుడి 19 ఏళ్ల కుమార్తె యోగితా సురానా సన్యాసినిగా మారనుంది. వచ్చేవారం హైదరాబాద్‌లోని జైన సమాజ్‌లో నిర్వహించే ఒక ఉత్సవ కార్యక్రమంలో గ్రాడ్యుయేట్ చదువుకున్న ఆమె సన్యాసినిగా మారనుంది. స్వర్ణకారుల కుటుంబంలో పుట్టి భోగాలు అనుభవిస్తున్న ఆమె త్వరలో తెల్లవస్త్రాలు కట్టుకుని సంపదను, విలాసాలను త్యజించనుంది.
ఈ సందర్భంగా యోగితాజీ సురానా మాట్లాడుతూ.. తనకు పైలట్, సీఏ, లేదా ఐఏఎస్ కావాలనే కోరిక చిన్నతనం నుంచి ఉందని చెప్పుకొచ్చింది. కానీ వయసు పెరిగిన కొద్దీ తన కోరికలు, అభిరుచుల్లో మార్పులు వచ్చాయని.. కోరికలకు అంతు ఉండదని అర్థం చేసుకున్నట్లుగా తెలిపింది. ఈ క్రమంలోనే ప్రాపంచిక సుఖాల నుండి, కోరికల నుంచి దూరంగా ఉండాలని వాటిని విడిచి పెట్టాలని అనుకుంటున్నట్లుగా తెలిపింది. ఈ మేరకు సోమాజిగూడలో శుక్రవారం జరిపిన మీడియా సమావేశంలో ఆమె ప్రకటించారు.
undefined
నిరుపేద మహిళకు పురుడు పోసిన అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ..
యోగితాజీ సురానా తల్లిదండ్రులు పద్మరాజు సురానా, స్వప్న సురానాలు. యోగిత నిర్ణయాన్ని జైన సామాజిక వర్గ పెద్దలకు వివరించారు. వారి ఆమోదం మేరకు ఈనెల 16వ తేదీన ఆమె సన్యాసినిగా మారనున్నట్లు తెలిపారు. వారు కూడా మీడియాతో మాట్లాడుతూ ఇకమీదట తమ కుమార్తె తమకు, సాధారణ జీవితానికి దూరంగా ఉండనున్నట్లుగా తెలిపారు. భౌతికపరమైన కోరికలు, మొహాలకు దూరంగా ఉండి మోక్షం పొందాలనుకుంటున్నానని అందుకే సన్యాసినిగా మారబోతున్నట్లుగా సూరానా తెలిపింది.
ఈ దీక్ష తరువాత యోగితాజీ సురానా కఠిన జీవితాన్ని గడుపుతుంది. ఆమె వారి కుటుంబ ఆభరణాల వ్యాపారాన్ని నిర్వహించగలదు. యోగిత తన జీవితాంతం మోక్షం కోసం ఫ్యాన్, లైట్, టూత్ బ్రష్ సోప్ లేదా అలాంటి భౌతిక సౌకర్యాలను ఉపయోగించదు. పద్మరాజ్ సురానా, సప్నా సురానాల ముగ్గురు కుమార్తెలలో యోగితా సురానా రెండో కూతురు. ఏడాదిన్నర క్రితమే ఆమె ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇది విన్న తల్లిదండ్రులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. దీనిమీద యోగితాజీ మాట్లాడుతూ.. ‘మొదటి షాక్ అయినా, ఆ తర్వాత, మా అమ్మ నన్ను అర్థం చేసుకుంది. నాకు మద్దతు ఇచ్చింది. తర్వాత మా నాన్న కూడా మా అమ్మను అనుసరించారు. మా సంఘంలో, తమ బిడ్డ స్వేచ్ఛా సంకల్పం గల సన్యాసినిగా మారుతుందని తల్లిదండ్రులు ఇద్దరూ అంగీకరించడం తప్పనిసరి. బలవంతం చేయడం పనికిరాదని ఆమె చెప్పింది.
ఆమె దీక్షా కార్యక్రమం ఏనుగులు, ఒంటెలు, గుర్రాలతో కూడిన మతపరమైన ఊరేగింపు జరుగుతుంది. ఈ సమయంలో యోగిత చివరిసారిగా సన్యాసిని జీవితంలోకి మారడానికి ముందు ఖరీదైన దుస్తులను ఇష్టమైన దుస్తులను ధరిస్తుంది. జైనమతంలో ఈ వేడుక సుదీర్ఘ ప్రక్రియ. నిరుడు జరిగిన ఆధ్యాత్మిక బోధనలతో సన్యాసినిగా మారడానికి నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఈ కార్యక్రమం ఐదు రోజుల పాటు కొనసాగుతుంది. దాదాపు 50,000 మంది ఈ వేడుకను తిలకించే అవకాశం ఉంది.