సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలి: అలయ్ బలయ్‌లో ఉపరాష్ట్రపతి వెంకయ్య

Published : Oct 17, 2021, 12:11 PM ISTUpdated : Oct 17, 2021, 04:48 PM IST
సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలి: అలయ్ బలయ్‌లో ఉపరాష్ట్రపతి వెంకయ్య

సారాంశం

హైద్రాబాద్ జలవిహార్ లో అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు,హర్యానా, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ గవర్నర్లు హాజరయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.  

హైదరాబాద్: మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కోరారు.దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని హైద్రాబాద్ జలవిహార్ లో అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 16 ఏళ్లుగా దసరా తర్వాత Alai Balai కార్యక్రమాన్ని బండారు దత్తాత్రేయ నిర్వహిస్తున్నారు.

also read:అలయ్ బలయ్‌కి పవన్‌కి ఆహ్వానం: ఇన్విటేషన్ ఇచ్చిన దత్తన్న కూతురు

హర్యానా గవర్నర్ Bandaru dattatreya  కూతురు విజయలక్ష్మి  ఏడాది  ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. .ఈ ఏడాది అలయ్ బలయ్ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై, హిమాచల్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,  తెలంగాణ మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ కవిత, జనసేన చీఫ్  పవన్ కళ్యాణ్ సహా పలువురు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి Venkaiah Naidu ప్రసంగించారు. దేశంలో సాంస్కృతిక పునరుజ్జీవనం జరగాలన్నారు.విపత్కర పరిస్థితి నుండి ఇప్పుడిప్పుడే బయట పడుతున్నామని ఆయన  చెప్పారు. అలయ్ బలయ్ కార్యక్రమం ఉదాత్తమైన కార్యక్రమంగా ఆయన కొనియాడారు.

మనమంతా సోదరీ సోదరుల్లా ఒక కుటుంబంంగా ఉన్నామని చాటి చెప్పేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు వెంకయ్యనాయుడు. మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకొనేందుకు యువత చొరవ చూపాలని ఆయన కోరారు. నేచర్, కల్చర్, ఫర్ బెటర్ ఫ్యూచర్ అనే విషయాన్ని మరవొద్దని వెంకయ్యనాయుడు ప్రజలకు సూచించారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడ ఒకే వేదికపై వచ్చి సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కోరారు. భిన్న సంస్కృతి, సంప్రదాయాలను ఏకతాటిపైకి తీసుకురావడమే అలయ్ బలయ్ ముఖ్య ఉద్దేశ్యమని ఆయన చెప్పారు.

ఈ వేదికపై పలువురిని సన్మానించారు. అంతకుముందు తెలంగాణ గవర్నర్ తమిళిసై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.    పలువురు కళాకారులతో ఆడిపాడి  గవర్నర్ సందడి చేశారు. అనంతరం ఆమె మాట్లాడారు. అందరికి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో దసరా సంబురాలు గొప్పగా ఉన్నాయన్నారు. బతుకమ్మ పండుగ ఉత్సవాలు చాలా సంతోషంగా జరుపుకొంటున్నామని చెప్పారు.

రాజకీయంగా ప్రత్యర్ధులుంటారు, శతృవులు కాదు కవిత

రాజకీయంగా ప్రత్యర్థులు ఉంటారని  శతృవులు ఉండరని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఈ వేడుకలో వారూ, వీరూ అనే బేధం లేకుండా అన్ని పార్టీల వారిని పిలిచి నిజమైన దసరా స్ఫూర్తిని తెలంగాణ ప్రజలకు బండారు దత్తాత్రేయ గుర్తు చేస్తున్నారని కొనియాడారు. ఈ వేడుకలో తనను కూడా భాగస్వామిగా చేసినందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ వేదికలో అన్ని పార్టీలకు చెందిన నాయకులతో కలిసి కూర్చోడం చాలా బాగుందన్నారు. . రాజకీయంగా ఎన్ని విమర్శలు చేసుకున్నా ప్రజల మంచి కోసం అందరం కలిసి నిలబడతామన్నారు.


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Mutton : కిలో చికెన్ ధరకే కిలో మటన్.. ఎక్కడో కాదు మన హైదరాబాద్ లోనే..!
Kavitha Emotional Speech: నా మీద కక్ష కట్టి పార్టీ నుంచి నెట్టేశారు | Asianet News Telugu