పెద్దపల్లి: పదిరూపాయల సిగరెట్ కోసం... గొడుగుతో గొంతులో పొడిచి హత్యాయత్నం (వీడియో)

Arun Kumar P   | Asianet News
Published : Oct 17, 2021, 11:08 AM ISTUpdated : Oct 17, 2021, 11:12 AM IST
పెద్దపల్లి: పదిరూపాయల సిగరెట్ కోసం... గొడుగుతో గొంతులో పొడిచి హత్యాయత్నం (వీడియో)

సారాంశం

కేవలం పది రూపాయల సిగరెట్ కోసం ఓ దుకాణాదారుడిపై యువకుడు హత్యాయత్నానికి పాల్పడిన దారుణ ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో చోటుచేసుకుంది. 

పెద్దపల్లి: కేవలం పది రూపాయల సిగరెట్ కోసం ఓ వ్యక్తిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడో దుండగుడు. సిగరెట్ అడిగితే ఇవ్వలేదని అల వైకుంఠపురం సినిమాలో మాదిరిగా గొడుగుతో గొంతులో పొడిచి చంపడానికి ప్రయత్నించాడు. ఈ దారుణం పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... peddapalli district సుల్తానాబాద్ పట్టణంలోని పూసాలలో ప్రసాద్ కిరాణా షాప్ నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే ఓ యువకుడు గంజాయి తాగి అదే మత్తులో సిగరెట్ కోసం ఈ షాప్ కు వెళ్లాడు. డబ్బులు ఇవ్వకుండానే సిగరెట్ ఇవ్వాలంటూ సదరు తాగుబోతు దౌర్జన్యానికి దిగాడు. ఉద్దెర ఇవ్వనని ప్రసాద్ చెప్పడంతో తాగుబోతు గొడవకు దిగాడు.

వీడియో

ఇద్దరి మద్య మాటామాటా పెరిగడంతో గంజాయి మత్తులో వున్న యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. తన చేతిలోని గొడుగుతో ప్రసాద్ గింతులో పొడిచాడు. అంతేకాదు అడ్డువచ్చిన ప్రసాద్ కుటుంబసభ్యులపై కూడా దాడికి పాల్పడ్డాడు.  

read more  హైదరాబాద్ శివారులో దారుణం... మహిళపై ఆటోడ్రైవర్ల గ్యాంగ్ రేప్

గొడుగుతో గొంతులో పొడవడంతో తీవ్ర రక్తస్రావం కావడంతో ప్రసాద్ ను కుటుంబసభ్యులు స్థానిక హాస్పిటల్ కు తరలించారు. అయితే పరిస్థితి విషమంగా వుండటంతో మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ హాస్పటల్ కు తరలించారు. ప్రసాద్ పరిస్థితి విషమంగా వున్నట్లు తెలుస్తోంది. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రసాద్ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం పరారీలో వున్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.

ఇక జగిత్యాల పట్టణంలో కూడా దారుణం చోటు చేసుకుంది. బీట్ బజార్ లో ఓ Rowdy sheeter హత్యకు గురయ్యాడు. పట్టణంలోని హనుమాన్ వాడ కు చెందిన రౌడీ షీటర్ తోట శేఖర్ ని ఓ దుండగుడు దారుణంగా హత్య చేశాడు. 

 నిన్న రాత్రి బీట్ బజార్ లో ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వద్ద మద్యం మత్తులో జరిగిన ఘర్షణలో చికెన్ కొట్టే కత్తితో శేఖర్ ను దుండగుడు stabbed to death. ఈ హత్యకు పాత కక్షలే కారణమని  స్థానికులు అంటున్నారు. murder జరిగిన తరువాత వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడుని అదుపులోకి తీసుకున్నారు. పండగ పూట జరిగిన ఈ ఘటనతో జగిత్యాల జిల్లా కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది.  

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?