టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎన్నికల షెడ్యూల్ విడుదల: ఈ నెల 25న ఎన్నిక

By narsimha lodeFirst Published Oct 17, 2021, 11:01 AM IST
Highlights

టీఆర్ఎస్ అధ్యక్ష పదవికి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది.ఈ నెల 25న అధ్యక్ష పదవికి ఎన్నికను నిర్వహించనున్నారు. ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల అధికారి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం నాడు విడుదల చేశారు.

హైదరాబాద్: TRS రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎన్నికల షెడ్యూల్ ఆదివారం నాడు విడుదలైంది. టీఆర్ఎస్ అధ్యక్ష పదవికి ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా మాజీ ఎమ్మెల్సీ Srinivas Reddy వ్యవహరించనున్నారు. ఆదివారం నాడు టీఆర్ఎస్ భవన్ లో Election schedule ను శ్రీనివాస్ రెడ్డి విడుదల చేశారు.

also read:తప్పుడు ఆరోపణలతో సానుభూతికి యత్నం.. హుజురాబాద్ ప్రజలు లొంగరు: ఈటలపై హరీశ్‌ వ్యాఖ్యలు

ఇవాళ్టి నుండి  నామినేషన్లను స్వీకరించనున్నారు.  ఈ నెల 22వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరణ ప్రక్రియన కొనసాగనుంది.ఈ నెల 23న నామినేషన్ల పరిశీలన సాగుతుంది.ఈ నెల 24న నామినేషన్ల ఉపసంహరణకు సమయం ఇచ్చారు.ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఉంటుందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.

ఈ నెల 25వ తేదీన టీఆర్ఎస్ అధ్యక్ష ఎన్నికను నిర్వహించనున్నారు. హైద్రాబాద్ హెచ్ఐసీసీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.  అదే రోజు టీఆర్ఎస్ ప్లీనరీని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా  ఎంపిక చేసిన ప్రతినిధులు హాజరు కానున్నారు.ఈ మేరకు ప్రతినిధులకు పాస్ లను జారీ చేయనున్నారు పార్టీ నాయకులు.

మరోవైపు ఇవాళ మధ్యాహ్నం తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్  చీఫ్, తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ పార్టీకి చెందిన శాసనసభపక్షం, పార్లమెంటరీపక్షంతో  భేటీ కానున్నారు.టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సాధించిన విజయాలతో పాటు రానున్న రోజుల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాంపై చర్చించనున్నారు.పార్టీ సంస్థాగత ఎన్నికలను పురస్కరించుకొని ఇప్పటికే వార్డు, గ్రామ, మండల, జిల్లా కమిటీల ఎంపిక పూర్తైంది. ఇక రాష్ట్ర అధ్యక్ష ఎన్నికను పూర్తి చేయాల్సి ఉంది. రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక పూర్తైతే రాష్ట్ర కమిటీ ఎన్నిక జరగనుంది.

Corona కారణంగా గత ఏడాది పార్టీ ప్లీనరీతో పాటు పార్టీ ఆవిర్బావ దినోత్సవ వేడుకలను టీఆర్ఎస్ వాయిదా వేసింది. పార్టీ ఏర్పాటై  20 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఈ ఏడాది పెద్ద ఎత్తున ఉత్సవాలను చేయాలని గులాబీ దళం నిర్ణయం తీసుకొంది. ఈ ఏడాది నవంబర్ 15న  వరంగల్‌లో Telangana Vijaya Garjanaపేరుతో సభను నిర్వహించనున్నారు.ఈ సభలో లక్షలాది మంది హాజరయ్యే అవకాశం ఉందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ప్రకటించిన విషయం తెలిసిందే.

click me!