ప్రణయ్ కాంస్య విగ్రహం: అమృతకు అందించిన తమిళనాడు దంపతులు

By narsimha lodeFirst Published Oct 17, 2018, 11:02 AM IST
Highlights

మిర్యాలగూడలో  పరువు హత్యకు గురైన ప్రణయ్  భార్య అమృతను, ప్రణయ్ కుటుంబసభ్యులను  కులాంతర వివాహం చేసుకొన్న కేఎస్ శంకర్, రేష్మారెడ్డిలు పరామర్శించారు

మిర్యాలగూడ: మిర్యాలగూడలో  పరువు హత్యకు గురైన ప్రణయ్  భార్య అమృతను, ప్రణయ్ కుటుంబసభ్యులను  కులాంతర వివాహం చేసుకొన్న కేఎస్ శంకర్, రేష్మారెడ్డిలు పరామర్శించారు. ప్రణయ్ కాంస్య విగ్రహన్ని  ఈ దంపతులు  అమృతకు అందించారు. 

తమిళనాడు రాష్ట్రంలోని కృష్ణగిరికి  చెందిన  కేఎస్ శంకర్ రేష్మారెడ్డిలు  మంగళవారం నాడు  మిర్యాలగూడకు వచ్చారు.  పరువు హత్యకు గురైన  ప్రణయ్‌ కుటుంబసభ్యులను, అమృతను పరామర్శించారు. 

ప్రణయ్ తండ్రి బాలస్వామిని చూసి శంకర్ కన్నీళ్లు పెట్టుకొన్నారు.  ప్రణయ్ హత్యకు గల కారణాలను అమృత నుండి  శంకర్ దంపతులు  అడిగి తెలుసుకొన్నారు. ప్రణయ్ కాంస్య విగ్రహన్ని ప్రత్యేకంగా కేఎస్ శంకర్ దంపతులు తయారు చేయించారు. ఈ కాంస్య విగ్రహన్ని  ప్రణయ్ కుటుంబసభ్యులకు ఇచ్చారు.

ప్రణయ్ ఇంట్లోనే  ఈ కాంస్య విగ్రహాన్ని ప్రతిష్టించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రణయ్‌ను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని  డిమాండ్ చేశారు. మానవతావాదులంతా ప్రణయ్ కుటుంబానికి అండగా ఉండాలని ఆయన కోరారు. దళితుడైన శంకర్‌ను తాను ప్రేమించి  పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవిస్తున్నట్టు  రేష్మారెడ్డి చెప్పారు. పరువు హత్యలు జరగకుండా ప్రభుత్వాలు చట్టాలు చేయాలని  శంకర్ దంపతులు డిమాండ్ చేశారు.


సంబంధిత వార్తలు

ప్రణయ్ హత్య నిందితులపై పీడీ యాక్ట్

ప్రణయ్ ఆత్మతో మాట్లాడిస్తాం: అమృత ఏం చేసిందంటే...

అమృతను కించపరుస్తూ కామెంట్...యువకుడు అరెస్ట్

అసభ్యకరమైన పోస్టులు.. పోలీసులకు అమృత ఫిర్యాదు

పోలీసులపై అనుమానం వ్యక్తం చేసిన ప్రణయ్ తండ్రి

ప్రణయ్ హత్య: ఎవరీ బారి...మారుతీరావుతో లింకు ఇలా...

నల్గొండ జిల్లాలో పరువు హత్యలు: నాడు నరేష్, నేడు ప్రణయ్

ప్రణయ్ హత్య: మాజీ ఉగ్రవాదితో అమృత తండ్రి ఒప్పందం

ప్రణయ్ విగ్రహం.. కోర్టు ఏమందంటే..

ప్రణయ్ హత్య: మారుతీరావు ఇంట్లో పోలీసుల సోదాలు

 

 

click me!