హైదరాబాద్‌లో భారీ వర్షం....ఒకరి మృతి (వీడియో)

By Arun Kumar PFirst Published Oct 17, 2018, 10:48 AM IST
Highlights

హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని ఇవాళ ఉదయం పలు ప్రాంతాల్లోదాదాపు గంటసేపు కుండపోత వర్షం కురిసింది. దీంతో వర్షపునీటితో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో నివాసముండే ప్రజలు ఇండ్లలోకి నీరు చేరడంతో  తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.  

ఈ వర్షపు నీటిలో కొట్టుకుపోయి ఓ వ్యక్తి మృత్యువాతపడ్డాడు. బోరబండ సాయిబాబా గుడి వద్ద వర్షపు నీటితో ఉదృతంగా ప్రవహిస్తున్న నాలాలో కొట్టుకుపోయి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. 

కొంపల్లి, షాపూర్, కుత్బుల్లాపూర్, ఐడీపీఎల్, రాజేంద్రనగర్, శంషాబాద్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, మియాపూర్, చందానగర్, జీడిమెట్ల, సుచిత్ర, మాసబ్ ట్యాంక్,పంజాగుట్ట, అమీర్ పేట్, లక్డీకాపూల్, మాదాపూర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మిగతా చోట్ల ఓ మోస్తరు వర్షం కురిసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు,డిజాస్టర్ మెనేజ్ మెంట్ బృందాలు అప్రమత్తమయ్యారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలపై వెంటనే స్పందించాలని జీహెచ్ఎంసీ కమీషనర్ దానకిషోర్ ఆదేశించారు. 

ఈ వర్షం కారణంగా మాదాపూర్ లో గంట నుండి భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. కిలోమేటర్ల మేర వాహనాలు నిలిచిపోయి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. దీంతో నగరవాసులు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. 

వీడియో

"

click me!