ఆయన మద్దతు నాకే: పీసీసీ చీఫ్ పదవిపై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

By Nagaraju penumalaFirst Published Nov 22, 2019, 5:10 PM IST
Highlights

ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్ పదవి నుంచి తప్పుకుంటే పీసీసీ చీఫ్ పదవి చేపట్టే జాబితాలో తాను ముందు వరుసలో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం తనకే మద్దతు ఇస్తున్నట్లు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. 

హైదరాబాద్: తెలంగాణ పీసీసీ చీఫ్ మార్పుపై కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. తెలంగాణ పీసీసీ చీఫ్ పదవి నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పుకుంటారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 

ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్ పదవి నుంచి తప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవీకాలం ముగిడయంతోపాటు, ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన పీసీసీ చీఫ్ పదవి నుంచి తప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారని తేల్చి చెప్పారు. 

ఇకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్ పదవి నుంచి తప్పుకుంటే పీసీసీ చీఫ్ పదవి చేపట్టే జాబితాలో తాను ముందు వరుసలో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం తనకే మద్దతు ఇస్తున్నట్లు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. 

ఆ హామీ ఇవ్వండి, కాంగ్రెస్ ను అధికారంలోకి తెస్తా: ఎంపీ కోమటిరెడ్డి ఆశలు

మహారాష్ట్రలో జరుగుతున్న రాజకీయ పరిణామాల అనంతరం తెలంగాణ పీసీసీ చీఫ్ మార్పుపై కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం దృష్టి సారిస్తుందన్నారు. తాను పీసీసీ చీఫ్ పదవికోసం పోటీ పడుతున్నట్లు చెప్పుకొచ్చారు. 

జాతీయ నాయకత్వాన్ని సైతం తాను సంప్రదించినట్లు చెప్పుకొచ్చారు. జాతీయ నాయకత్వం సైతం తన అభ్యర్థిత్వంపై సానుకూలంగానే ఉందని చెప్పుకొచ్చారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఇకపోతే త్వరలోనే తాను రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టబోతున్నట్లు తెలిపారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.  

ఇకపోతే ఇటీవలే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, సీడబ్ల్యూసీ సభ్యుడు గులాం నబీ ఆజాద్ తెలంగాణ పర్యటన నేపథ్యంలో పీసీసీ చీఫ్ పదవిపై తన మనసులో కోరికను బయటపెట్టారు కోమటిరెడ్డి. తనకు పీసీసీ చీఫ్ గా అవకాశం ఇవ్వాలని గులాం నబీ ఆజాద్ ను కోరారు. 

తనకు పీసీసీ చీఫ్ పదవి ఇస్తే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తానని హామీ ఇచ్చారు. అలాగే అత్యధిక లోక్ సభ స్థానాలను సైతం గెలిపిస్తానని ఆయనకు హామీ ఇచ్చారు. జాతీయ నాయకత్వం దృష్టికి తన అభ్యర్థిత్వాన్ని చేరవేయాలని కోరారు. 

అంతేకాదు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్  రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలంటూ ఆయన అనుచరులు సైతం గాంధీభవన్ వద్ద హల్ చల్ చేశారు. జై కాంగ్రెస్, జై కోమటిరెడ్డి అంటూ నినాదాలు చేస్తూ రచ్చ రచ్చ చేసిన సంగతి తెలిసిందే. 

ఇకపోతే తెలంగాణ పీసీసీ చీఫ్ పోస్టుకు చాలా మంది నేతలు పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి, ఎంపీ రేవంత్ రెడ్డి, జానారెడ్డి, వి.హన్మంతరావులతోపాటు పలువురు నేతలు పోటీ పడుతున్నారు. 

తనకు పీసీసీ చీఫ్ పదవి ఇస్తే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తానని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. తనకు అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంతోపాటు 10 మంది ఎంపీలను గెలిపిస్తానని హామీ ఇచ్చారు.

అన్ని పార్టీలు తిరిగా....వారిని నిలువరించే దమ్ముంది, పీసీసీ చీఫ్‌ పదవిపై జగ్గారెడ్డి కన్ను

తెలంగాణ పీసీసీ పదవికి రెడ్లు, బ్రహ్మణులు మాత్రమే అర్హలు కాదని ఇతర కులాలు కూడా అర్హలేనంటూ చెప్పుకొచ్చారు జగ్గారెడ్డి. బడుగు బలహీన వర్గాల నుంచి మాజీ ఎంపీ వి.హన్మంతరావు సమర్థుడని చెప్పుకొచ్చారు. 

ఇకపోతే మాల సామాజిక వర్గం నుంచి మల్లుభట్టి విక్రమార్క, మాదిగ సామాజిక వర్గం నుంచి దామోదర రాజనర్సింహా పీసీసీ చీఫ్ పదవులకు అర్హులని తెలిపారు. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ సాధారణ కార్యకర్త నుంచి పార్టీ జనరల్ సెక్రటరీగా కొనసాగుతున్న బొల్లు కిషన్ కూడా అర్హుడేనంటూ జగ్గారెడ్డి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. 

జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు... ఎవరీ బొల్లు కిషన్

click me!