బదిలీ చేసిన సీఐపై ఆగ్రహం: పెట్రోల్ పోసుకుని ఏఎస్సై ఆత్మహత్యాయత్నం

Published : Nov 22, 2019, 04:32 PM ISTUpdated : Dec 02, 2019, 08:13 AM IST
బదిలీ చేసిన సీఐపై ఆగ్రహం: పెట్రోల్ పోసుకుని ఏఎస్సై ఆత్మహత్యాయత్నం

సారాంశం

బదిలీపై వెళ్లడం ఇష్టం లేని నరసింహా తన బదిలీని నిలిపివేయాలంటూ సీఐను కోరాడు. అయితే ఆయన అంగీకరించకపోవడంతో బాలాపూర్ పీఎస్ సమీపంలోని వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

హైదరాబాద్: పోలీస్ శాఖలో ఉన్నతాధికారి వేధింపులు తట్టుకోలేక ఏఎస్సై ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోవడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. 

ఈ విషాద ఘటన హైదరాబాద్ లోని బాలాపూర్ పీఎస్ లో చోటు చేసుకుంది. బాలాపూర్ పీఎస్ లో నరసింహా ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఇటీవలే ఏఎస్సై నరసింహాను బాలాపూర్ పీఎస్ నుంచి మంచాల పీఎస్ కు బదిలీ చేశారు ఆ ఏరియా సీఐ. 

అయితే బదిలీపై వెళ్లడం ఇష్టం లేని నరసింహా తన బదిలీని నిలిపివేయాలంటూ సీఐను కోరాడు. అయితే ఆయన అంగీకరించకపోవడంతో బాలాపూర్ పీఎస్ సమీపంలోని వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

తన బదిలీకి సీఐ సైదులే కారణమంటూ ఆరోపించారు. గాయపడిన ఏఎస్సై నరసింహాను తోటి ఉద్యోగులు కాపాడి ఆస్పత్రికి తరలించారు. 30శాతం గాయాలపాలైన ఏఎస్సై నరసింహా అపోలో డీఆర్డీవో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.  

ఇకపోతే ఏఎస్సై నరసింహా అంతకు ముందు మేడ్చల్ పీఎస్ లో పనిచేసినట్లు తెలుస్తోంది. సీఐ సైదులు తనను వేధిస్తున్నారంటూ ఏఎస్సై నరసింహా పదేపదే ఆరోపించేవారని తోటి ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. 

బాలాపూర్ పీఎస్ పరిధిలో పనిచేస్తున్న తనను సీఐ సైదులు తనను వేధిస్తున్నారంటూ ఆరోపించారు నరసింహా. తనపై కొంతమంది తప్పుడు ఆరోపణలు చేస్తూ సీఐ సైదులుకు కొంతమంది ఫిర్యాదు చేశారని ఆరోపించారు. 

అలాగే సీఐ సైదులు ఆ ఫిర్యాదులను ఆధారంగా చేసుకుని తనపై ఉన్నతాధికారులకు తప్పుడు నివేదికలు అందజేశారంటూ ఆరోపించారు. అందువల్లే తనపై బదిలీ వేటు వేశారని ఆరోపించారు. 

తన బదిలీని నిలిపివేయావని ఎన్నిసార్లు కోరినా వినలేదని మదనపడుతున్న నరసింహా ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. తనపై వచ్చిన తప్పుడు ఆరోపణలను ఎలా నమ్ముతారంటూ ఏఎస్సై నరసింహా తలచుకుని పదేపదే ఆవేదన వ్యక్తం చేసేవాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.  

ఈ వార్తలు కూడా చదవండి

దారుణం: బావ మరిది కుటుంబానికి నిప్పు, ఐదుగురి పరిస్థితి విషమం

కారణమిదే: నిమ్స్‌లో నర్స్ నిర్మల ఆత్మహత్యాయత్నం

PREV
click me!

Recommended Stories

Telangana Rising Global Summit : తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగాలు
Telangana Rising గ్లోబల్ సమ్మిట్ తో కలిగే మార్పులు, లాభాలు ఏమిటి?