ఝాన్సీపై సూర్య ఆంక్షలు: ఆత్మహత్యకు కారణమదే

Published : Feb 12, 2019, 01:06 PM IST
ఝాన్సీపై సూర్య ఆంక్షలు: ఆత్మహత్యకు కారణమదే

సారాంశం

సినీ నటి ఝాన్సీ ఆత్మహత్యకు ఆమె ప్రియుడు సూర్య కారణమని పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో ఆయనను  మంగళవారం నాడు అరెస్ట్ చేశారు.

హైదరాబాద్:సినీ నటి ఝాన్సీ ఆత్మహత్యకు ఆమె ప్రియుడు సూర్య కారణమని పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో ఆయనను  మంగళవారం నాడు అరెస్ట్ చేశారు. సీరియల్స్‌లో నటించకూడదని కోరుతూ ఝాన్సీపై సూర్య  తీవ్రమైన ఆంక్షలు విధించినట్టుగా పోలీసులు గుర్తించారు.

ఓ టీవీ ఛానెల్‌లోని  సీరియల్‌లో  ఝాన్సీ నటించింది.  సూర్యతో ఆమె ప్రేమలో పడింది. వీరిద్దరూ పెళ్లి కూడ చేసుకోవాలని భావించారు. రెండు కుటుంబాల పెద్దలకు కూడ ఈ విషయాన్ని చెప్పారు.

కానీ, ఝాన్సీ నటించకూడదని సూర్య ఆమెపై ఆంక్షలు విధించినట్టు పోలీసులు గుర్తించారు. కొన్ని సమయాల్లో ఝాన్సీ ఫోన్స్‌ను సూర్య బ్లాక్ చేసినట్టుగా కూడ గుర్తించారు.

ఝాన్సీ ఆత్మహత్య చేసుకొన్న రోజున సూర్య ఆమెను  తీవ్రంగా మందలించినట్టుగా పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యకు ముందు ఝాన్సీ సూర్యకు ఫోన్ చేసింది. ఆ సమయంలో ఆమెపై తీవ్రంగా మండిపడినట్టు పోలీసులు గుర్తించారు.

నటనను మానుకోవాలని సూర్య తేల్చి చెప్పినట్టు విచారణలో తేల్చారు.  ఝాన్సీ ఆత్మహత్యకు సూర్య కారణంగా తేల్చి ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.  నిందితుడిని రిమాండ్‌కు తరలించనున్నారు.

సంబంధిత వార్తలు

టీవీ సీరియల్ నటి ఝాన్సీ ఆత్మహత్య: ప్రియుడు సూర్య అరెస్టు?

ఝాన్సీ కేసు: సూర్యకు ఆమె పరిచయం చేసింది, బర్త్‌డే‌కు బైక్ గిఫ్ట్

టీవీ నటి ఝాన్సీ సూసైడ్: 'అతను లేనిదే నేను బతుకను', వేధింపులేనా..

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!