డైరెక్టర్ బాపినీడు మృతి.. కేసీఆర్ సంతాపం

Published : Feb 12, 2019, 12:27 PM IST
డైరెక్టర్ బాపినీడు మృతి.. కేసీఆర్ సంతాపం

సారాంశం

ప్రముఖ సినీ దర్శకుడు, పాత్రికేయుడు, కథా రచయిత విజయబాపినీడు మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. 

ప్రముఖ సినీ దర్శకుడు, పాత్రికేయుడు, కథా రచయిత విజయబాపినీడు మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. పలు విజయవంతమైన చిత్రాలు అందించడమే కాకుండా, విజయ అనే పత్రిక నడపడం ద్వారా విజయాన్ని తన ఇంటి పేరుగా మార్చుకున్న బాపినీడు తెలుగు సినీ రంగ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే ముద్ర వేశారని సిఎం కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బాపినీడు మంగళవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతిపట్ల ఇప్పటికే పలువురు సంతాపం వ్యక్తం చేశారు.  బాపినీడు దర్శకుడిగా, నిర్మాతగా పలు చిత్రాలకు తెరకెక్కించారు. 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ